Friday, January 28, 2022

Policybazaar IPO: నవంబర్​ 1 నుంచి ఐపీఓకి రానున్న పాలసీ బజార్.. ఒక్కో షేర్ విలువ ఎంతో తెలుసా?

కంపెనీలో బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ ఆన్ లైన్ ఇన్సురెన్స్ ప్లాట్ ఫాం పాలసీ బజార్ కూడా చేరిపోయింది. పీబీ ఫిన్​టెక్​ లిమిటెడ్ సంస్థకు చెందిన పాలసీ బజార్, క్రెడిట్ కంపారిజన్ పోర్టల్ పైసా బజార్ నవంబరు 1 నుంచి ఐపీఓ(Initial public offering) జాబితాలో చేరనున్నాయి.

Policybazaar IPO: ఈ ఏడాది చాలా కంపెనీలో బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ ఆన్ లైన్ ఇన్సురెన్స్ ప్లాట్ ఫాం పాలసీ బజార్ కూడా చేరిపోయింది. పీబీఫిన్​టెక్​ లిమిటెడ్ సంస్థకు చెందిన పాలసీ బజార్, క్రెడిట్ కంపారిజన్ పోర్టల్ పైసా బజార్ నవంబరు 1 నుంచి ఐపీఓ (Initial public offering) జాబితాలో చేరనున్నాయి. మంగళవారం నాడు ఈ కంపెనీ తన ఒక్కో షేర్ ధరను ప్రకటించింది. ఒక్కో షేర ధర రూ.940-980 చొప్పున మొత్తం రూ.5826 కోట్ల ఇనిషియల్ షేర్ ను విక్రయానికి ఉంచింది. మూడు రోజుల ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) సబ్ స్క్రిప్షన్ నవంబరు 1న ప్రారంభమై నవంబరు 3న ముగుస్తుందని ఈ సంస్థ స్పష్టం చేసింది. ఈ ఇష్యూ పరిమాణం వచ్చేసి 6,07,30,265 షేర్లను కలిగి ఉంటుందని, ఫేస్ వ్యాల్యూ ఒక్కోటి రూ.2లుగా ఉంటుందని పేర్కొంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 5826 కోట్ల నిధులను సమకూర్చనుంది. ప్రస్తుతం ఉన్న ప్రమోటర్లు, వాటా దారుల ద్వారా రూ.1959.72 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా రూ.3750 కోట్ల తాజా ఇష్యూను కలిగి ఉంది. ఓఎఫ్ఎస్, SVF పైథాన్-2(కేమాన్) ఇన్వెస్టర్ ద్వారా నడుస్తుంది. ఇది రూ.1875 కోట్ల విలు వైన షేర్లను విక్రయిస్తుంది. ప్రస్తుతానికి కేమాన్ ఈ కంపెనీలో 9.45 శాతం వాటాను కలిగి ఉంది.

తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం కంపెనీ బ్రాండ్ల విజిబిలిటీ, అవగాహనను పెంపొందిచడానికి, ఆఫ్ లైన్ లో వినియోగదారులను పెంచడానికి ఉపయోగించపడుతుంది. అంతేకాకుండా వృద్ధి కార్యకలాపా లను విస్తరించడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయం వ్యూహాత్మక పెట్టుబడులు, కొనుగోళ్లకు నిధులు సమకూర్చడం, భారత్ వెలుపల ఉనికిని విస్తరించడం, సాధారణ కార్పోరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించపడుతుంది.

నవంబర్​ 1 నుంచి ఐపీఓకి..

PB ఫిన్టెక్ అనేది బీమా, రుణ ఉత్పత్తులకు సంబంధించిన ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫాం. ఇది సాంకేతికత, డేటా, ఆవిష్కరణల శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా బీమా, క్రెడిట్ ఇతర ఆర్థిక ఉత్పత్తులకు అనుకూలమైన వాటికి యాక్సెస్ ను అందిస్తుంది. మరణం, వ్యాధి, నష్టం వల్ల సంభవించే ఆర్థిక ప్రభావం గురించి అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ, సింటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, HDFC బ్యాంక్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా లాంటి సంస్థలు ఈ ఇష్యూ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి

Related Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Latest Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Canara Bank Profit: మూడో త్రైమాసికంలో బ్యాంకుకు లాభాల పంట..!

Canara Bank Profit: కెనరా బ్యాంక్ క్యూ3 ఫలితాలు: డిసెంబరు 2021 త్రైమాసికం (Third Quarter)లో నికర లాభం...

RRB-NTPC Exam: రెండు రైళ్లకు నిప్పటించిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. పలువురు అరెస్టు..!

RRB-NTPC Exam: బీహార్‌లో ఉద్రక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని గయా(Gaya) జిల్లాలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) అభ్యర్థులు ఆందోళనకు.. ...