Friday, January 28, 2022

Meat in Hotel: బూజు పట్టిన మాంసం, పురుగులు తిరుగుతున్న రొయ్యలు.. ఇదే రెస్టారెంట్‌లో ఫుడ్ | Restaurant using spoiled meat to serve customers in Hyderabad

హోటళ్లలో బిర్యానీ బాగుందని లొట్టలేసుకుంటూ తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. ఆ హోటల్ వాళ్లు సర్వ్‌ చేసే బిర్యానీ, కూరలలో ఉపయోగించే మాంసం ఎప్పటిదో, పురుగులు పట్టిందో లేక బూజు పట్టిందో

Meat in Hotel: హోటళ్లలో బిర్యానీ బాగుందని లొట్టలేసుకుంటూ తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. ఆ హోటల్ వాళ్లు సర్వ్‌ చేసే బిర్యానీ, కూరలలో ఉపయోగించే మాంసం ఎప్పటిదో, పురుగులు పట్టిందో లేక బూజు పట్టిందో తెలియని పరిస్థితి నెలకొంది.. కొన్ని హోటల్స్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లోని జస్ట్ డ్రైన్‌ ఇన్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు అక్కడున్న పరిస్థితులను చూసి దిమ్మతిరిగింది. అక్కడ కనిపించింది బూజు పట్టిన మటన్‌.. రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్‌… పురుగులు పట్టిన రొయ్యలు… అవేమీ చెత్తలో పారేసేందుకు సిద్ధంగా ఉన్నవి కావు. వండి సర్వ్ చేసేందుకు ఉంచినవే. వీటితో చేసిన బిర్యానీలు, కబాబ్‌లనే కస్టమర్లకు సర్వ్‌ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

అలా హోటల్‌పై చర్యలు తీసుకున్నారు. జస్ట్‌ డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌లో పరిస్థితి దారుణంగా ఉందని అధికారులు తెలిపారు. తమ తనిఖీల్లో ఫ్రిడ్జ్‌ల్లో బూజు పట్టిన మాంసం కనిపించిందని.. 2 రోజుల క్రితం బిర్యానీని కూడా తిరిగి వేడి చేసి కస్టమర్లకు అందిస్తున్నట్టు గుర్తించామన్నారు. మాంసాన్ని స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.

……………………………………. : చలికాలంలో ఖర్జూరాలు తింటే గుండె సమస్యలు దూరం!..

ఫలితాలు వచ్చాక హోటల్‌పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు.. హోటల్ నిర్వాహకులపై అక్కడికక్కడే 5 వేల రూపాయల ఫైన్‌ విధించారు. అసలు రెస్టారెంట్‌ నిర్వహించడానికి ట్రేడ్‌ లైసెన్స్‌ లేదని తమ తనిఖీల్లో గుర్తించామన్నారు.

ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.. బిర్యానీ అంటే ఇష్టపడే హైదరాబాదీల క్రేజ్‌ను హోటల్ నిర్వాహకులు క్యాష్‌ చేసుకొని కల్తీలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు అధికారులు.

Related Articles

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Latest Articles

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Canara Bank Profit: మూడో త్రైమాసికంలో బ్యాంకుకు లాభాల పంట..!

Canara Bank Profit: కెనరా బ్యాంక్ క్యూ3 ఫలితాలు: డిసెంబరు 2021 త్రైమాసికం (Third Quarter)లో నికర లాభం...