Sunday, January 23, 2022

T-20 World Cup : పైన‌ల్ కు చేరిన న్యూజిలాండ్

టీ-20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్‌ గండం నుంచి కివీస్ బయపడినట్లైంది. టీ-20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరిన తొలిజట్టుగా న్యూజిలాండ్‌ నిలిచింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలుపొంది మొదటి సారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో మొయిన్ అలీ, డేవిడ్ మలన్ మినహా బ్యాట్స్‌మెన్స్ ఎవరు పెద్దగా రాణించలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, జేమ్స్ నీషమ్, ఇష్ సౌదీ, అదమ్ మిల్నేలకు తలో వికెట్టు దక్కింది. లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ఔటవగా, మూడో ఓవర్‌లో కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ ఫెవిలియన్‌కు చేరాడు. దీంతో న్యూజిలాండ్‌ కష్టాల్లో పడింది.

అయితే మరో ఓపెనర్ డెరిల్ మిచెల్… కాన్వేతో కలిసి ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. కానీ 14 ఓవర్లో కాన్వే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఫిలిప్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. తర్వాత క్రీజులోకి దిగిన జిమ్మీ నీషమ్ 11 బంతుల్లోనే 27 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్ 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, 19వ ఓవర్లో డెరిల్ మిచెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది న్యూజిలాండ్‌కు విజయాన్ని అందించాడు. 47 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మిచెల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, అదిల్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది. 2019 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయింది. ఈ విజయంతో.. ఆనాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టైంది. ఇవాళ టీ-20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. దుబాయిలో రాత్రి ఏడున్నరకు ఈ మ్యాచ్ జరగనుంది.

Related Articles

Ramesh Babu : ర‌మేష్ బాబు పెద‌క‌ర్మ‌కు హాజ‌రైన మ‌హేష్‌..వైర‌ల్ అవుతున్న ఫొటో!

ప్రధానాంశాలు:రమేష్ బాబు పెద కర్మకు హాజరైన మహేష్కోవిడ్ నుంచి కోలుకున్న మహేష్నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో ర‌మేష్ బాబు మ‌ర‌ణం అనేది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది....

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

Latest Articles

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...