Friday, January 28, 2022

Virat Kohli : విరాట్ కోహ్లి కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన కేసులో హైదరాబాద్ వాసి అరెస్ట్ | Mumbai Police Arrests Man From Hyderabad Over Rape Threats To Virat Kohlis Daughter

భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన రామ్ నగేష్ ను పోలీసులు అదుపులోకి..

Virat Kohli : భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన రామ్ నగేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ముంబైకి తరలించారు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో రామ్ నగేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Pickle : నిల్వ పచ్చళ్ళతో ఆరోగ్యానికి ప్రమాదమా..?

కోహ్లి కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన 23ఏళ్ల అలిబత్తిని రామ్ నగేష్ ను ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి తరలించి విచారణ జరుపుతున్నారు. భారత బౌలర్ మహ్మద్‌ షమీకి సపోర్ట్‌ ఇచ్చినందుకు కోహ్లిని బెదిరించాడు రామ్ నగేశ్.

టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని భారత జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా, కొందరు హద్దులు మీరారు. ఓటమిని సహించలేని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్​కు పాల్పడ్డారు. ప్రధానంగా పేసర్ మహ్మద్​ షమీని టార్గెట్ చేశారు. షమీని బూతులు తిట్టారు. అంతేకాదు మతపరమైన దూషణకు దిగారు.

OnePlus Nord 2 : మళ్లీ పేలిన వ‌న్‌ప్ల‌స్ నోర్డ్ 2 ఫోన్.. యూజర్‌కు తీవ్రగాయాలు.. ఫొటోలు వైరల్!

ఈ క్రమంలో షమీకి కెప్టెన్ విరాట్ కోహ్లి అండగా నిలిచాడు. దీంతో కొందరు నెటిజన్లు కోహ్లిపై విరుచుకుపడ్డారు. నీచమైన కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా కోహ్లి భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను ఇందులోకి లాగారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడతామంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. అభంశుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడ్డారు. ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమిషన్. అతి చేసిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని, ఎఫ్‌ఐఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన రామ్ నగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Related Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Latest Articles

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...

UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది....