Friday, January 28, 2022

Parking Fee : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌‌లో అడ్డగోలు దోపిడీ..అరగంటకు పార్కింగ్ ఫీజు రూ.500 వసూలు | A half an hour parking fee of Rs.500 was charged at Secunderabad railway station

ఓ వ్యక్తి తన కారును రైల్వే స్టేషన్ లో కేవలం అర గంట పార్క్ చేసినందుకు ఏకంగా 500 ఫీజ్ వసూలు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగింది.

Secunderabad railway station : బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు ఎంత ఉంటుంది.. మహా అయితే.. గంటకు 10 రూపాయలుంటుంది. అంతకు మించి అంటే.. 20 లేదా 50 రూపాయలుంటుంది. కానీ… ఓ వ్యక్తి తన కారును రైల్వే స్టేషన్ లో కేవలం అర గంటల పార్క్ చేసినందుకు ఏకంగా 500 ఫీజ్ వసూలు చేశారు. దీంతో రైల్వే స్టేషన్లు కూడా ప్రైవేటీకరణ చేశారా.. అంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పార్కింగ్ ఫీజ్ కు సంబంధించిన టికెట్‌ను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. కేంద్ర రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ.. ఈ సంఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగింది.

Youngster Attack Girlfriend : హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం..ప్రేమించిన యువతిపై 18సార్లు కత్తితో పొడిచి దాడి

హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్ ఏకే జైర‌థ్‌ ఈ నెల 4వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వెళ్లారు. అక్కడున్న పార్కింగ్‌ ప్లేస్‌లో త‌న వాహ‌నాన్ని పార్క్ చేశారు. త‌న పని పూర్తయిన అనంత‌రం తిగిరి పార్కింగ్‌కు చేరుకున్నాడు. త‌న‌కు ఇచ్చిన పార్కింగ్ ఫీజును చూసి ఆర్మీ ఆఫీస‌ర్ షాక్ అయ్యాడు.

కేవ‌లం 31 నిమిషాల‌కు 500 ఛార్జ్ వేయడంతో… ఇంత ఎందుకంటూ ప్రశ్నించారు. అయినా… పార్కింగ్ నిర్వాహ‌కులు ఆయ‌న మాట‌లు ఏ మాత్రం వినిపించుకోకుండా 500 వ‌సూలు చేశారు. పార్కింగ్ ఫీజు 423 రూపాయల 73 పైస‌లు.. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ కింద 38రూపాయల 14 పైసలు చొప్పున వ‌సూలు చేశారు.

Mariamma Lockup Death : గుండె ఆగిపోయేలా కొడతారా?..మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు సీరియస్

పార్కింగ్ నిర్వాహ‌కుల‌తో వాదించిన‌ప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక బాధితుడు త‌నకు జ‌రిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవ‌లం 31 నిమిషాల‌కు పార్కింగ్ ఫీజు 500 వ‌సూలు చేయ‌డాన్ని కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. ఇది దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...