Friday, January 21, 2022

Eatala Rajender : రేపు ఉ.11గంటలకు MLAగా ఈటల రాజేందర్ ప్రమాణం Eatala Rajender To take oath as MLA Seventh Time

గత ఆరుసార్లకు భిన్నంగా.. ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు.

Eatala Rajender : మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టబోతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు (నవంబర్ 10, బుధవారం) ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అసెంబ్లీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది ఏడోసారి. ఇప్పటివరకు ఆరు సార్లు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ సీటింగ్ వైపు కూర్చున్నారు. కానీ.. ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం.

Read This : Etela Rajender : ఈటల రాజేందర్ ఘన విజయం.. హిస్టరీ రిపీట్స్

ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత ఈటల రాజేందర్.. బీజేపీలో చేరారు. అదే పార్టీ నుంచి టికెట్ పై హుజూరాబాద్ బైపోల్ లో గెలిచారు. గత ఆరుసార్లకు భిన్నంగా.. ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రమంతటా ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో ఈ ఆసక్తి మరింత పెరగనుంది. బీజేపీ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఈటల రాక, ఈటల ప్రసంగం, ఆయన విమర్శలు.. ప్రభుత్వం వివరణలు.. ఇవన్నీ టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కానున్నాయి.

రేపటి ఈటల ప్రమాణస్వీకారాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని రాష్ట్ర బీజేపీ, ఈటల మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Read This : Etela Rajender : మొదటిసారి రాష్ట్ర బీజేపీ ఆఫీసుకు ఈటల… సన్మానానికి భారీ ఏర్పాట్లు!

Related Articles

Ravi Teja Mother : రవితేజ తల్లిపై కేసు నమోదు

ప్రధానాంశాలు:సినిమాలతో రవితేజ బిజీవార్తల్లో రవితేజ తల్లిఅక్రమంగా నిర్మాణపై కేసుసినిమాలతో తప్పా వ్యక్తిగత విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన ఫ్యామిలీ కూడా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించదు. ఆ మధ్య...

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

Latest Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...