Friday, January 28, 2022

Hyderabad Metro : ఇకపై ఉదయం 6 గంటలకే తొలి మెట్రో రైలు ప్రారంభం! | Hyderabad Metro could revise timings to start from 6AM

నగర మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇకపై మెట్రో సర్వీసులు ఉదయం 6 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం నుంచి తొలి మెట్రో ప్రారంభం కానుంది.

Hyderabad Metro : నగర మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇకపై మెట్రో సర్వీసులు ఉదయం 6 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. రేపు (బుధవారం) ఉదయం నుంచి తొలి మెట్రో ప్రారంభం కానుంది. ఈ మేరకు మెట్రో అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాత్రి 10:15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయల్దేరనుంది. అక్కడి నుంచి చివరి గమ్య స్థానానికి 11:15 గంటలకు చేరుకోనుంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో మెట్రో సేవల వేళలను పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి కాకుండా ఉదయం 6 గంటలకే మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తేవాలని మెట్రో ప్రయాణికుల నుంచి మంత్రి కేటీఆర్‌కు అభ్యర్థనలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మెట్రో వినియోగదారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలును కోరారు. మెట్రో వినియోగదారులు మంత్రి కేటీఆర్ కు ఫొటోలు, వీడియోలను ట్వీట్ చేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు ఉదయం 6 గంటలకే చేరుకుంటున్నారని, కానీ, ఉదయం 7 గంటల వరకు మెట్రో సర్వీసులు ప్రారంభం కావడం లేదని ట్వీట్ చేశారు. గంట పాటు అదనంగా వేచి ఉండాల్సిన వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో క్యాబ్ ద్వారా ఆఫీసులకు వెళ్లడం ఖరీదైన ప్రయాణంగా తెలిపారు.

ఉదయం సమయంలో క్యాబ్ లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంటోందని, సీనియర్ సిటిజన్లు సైతం ఉదయం రద్దీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 గంటల నుంచి మెట్రో టైమింగ్స్ ప్రారంభం అయ్యేలా సవరించాలన్న అభ్యర్థనపై మంత్రి స్పందించారు. ప్ర‌యాణికుల విజ్ఞ‌ప్తిని మెట్రో ఎండీ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. ఈ సూచనతో తాను ఏకీభవిస్తున్నానని, HMRL MD, L&T సమన్వయంతో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. HMRL MD ఎన్వీఎస్ రెడ్డి మంత్రి కేటీఆర్ సూచనకు సానుకూలంగా సమాధానమిచ్చారు. సవరించిన సమయాలపై అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.
Read Also : Eatala Rajender : రేపు ఉ.11గంటలకు MLAగా ఈటల రాజేందర్ ప్రమాణంRelated Articles

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Latest Articles

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Canara Bank Profit: మూడో త్రైమాసికంలో బ్యాంకుకు లాభాల పంట..!

Canara Bank Profit: కెనరా బ్యాంక్ క్యూ3 ఫలితాలు: డిసెంబరు 2021 త్రైమాసికం (Third Quarter)లో నికర లాభం...