Wednesday, January 26, 2022

Virat Kohli : నేను అలా ఉన్నప్పుడు క్రికెట్ నుండి త‌ప్పుకుంటా.. విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్ | The Telugu News

Virat Kohli : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తాను క్రికెట్ ఆడే విషయమై సంచలన కామెంట్స్ చేశాడు. టీ 20 వరల్డ్ కప్ కెప్టెన్‌గా దిగిపోయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు విరాట్ కోహ్లీ.. టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అయినప్పటికీ టీమిండియా సెమిస్ ఆశలు ఆవిరి కావడంతో ఆ మ్యాచ్ గెలుపు పెద్దగా ప్రయోనం చేకూర్చలేదు. దీంతో టీ ట్వంటీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి టీమిండియా వీడ్కోలు పలికింది.

virat kohli

నమీబియాతో ఆడిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత విరాట్, రవిలకు వీడ్కోలు పలకడం విశేషం. అనంతరం మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తాను ఇప్పుడు చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నానని, టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవమని తెలిపాడు. టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే బాధ్యతను తాను వదిలేసి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో అనుకున్న ఫలితాలు రాలేదని తనకు తెలుసని, అయితే, తాము బాగానే ఆడామని, టీ ట్వంటి క్రికెట్ భిన్నమైందని వివరించాడు. ఈ క్రమంలోనే రవిశాస్త్రికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన కోహ్లీ.. తన ఆటలో దూకుడు తగ్గదన్నాడు.

Virat Kohli : ఇప్పుడు తనకు రిలీఫ్‌గా ఉందంటున్న విరాట్ కోహ్లీ..

తాను ఒక వేళ అలా ఆడలేకపోతే ఆ రోజు నుంచి క్రికెట్ ఆడటం మానేస్తానని చెప్పాడు. తాను కెప్టెన్ కాకముందు నుంచీ ఆటపైన దృష్టి పెట్టానని విరాట్ కోహ్లీ తెలిపాడు. మిగతా ఆటలతో పోలిస్తే టీ ట్వంటీ ఆట భిన్నమైందని, తొలి రెండు మ్యాచులలో ఎవరైతే పై చేయి సాధిస్తారో వారి ఆధిపత్యమే కొనసాగుతుందని, వారే విజేతలుగా నిలిచే చాన్సెస్ ఉంటాయని కోహ్లీ తెలిపాడు. తొలి రెండు మ్యాచులలో తాము మిస్సయ్యామని కోహ్లీ ఒప్పుకున్నాడు.

Related Articles

Mahesh Babu: సర్కారు వారి పాట గుడ్ న్యూస్.. అనుకున్నదే చెప్పేశారుగా..!

Sarkaru Vaari Paata Music: మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'సర్కారు వారి పాట' నుంచి రిపబ్లిక్ డే కానుక ఇచ్చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా...

‘వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత’.. ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ చూశారా..?

నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు...

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Latest Articles

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...