Friday, January 28, 2022

KCR : వరిపై కేసీఆర్ కీలక ప్రకటన.. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు | CM KCR Key Statement On Paddy Procurement


వరి పంటకు సంబంధించి సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొంటుందా? లేదా? అనేది కేంద్రం స్పష్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వచ్చే..

KCR : వరి పంటకు సంబంధించి సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొంటుందా? లేదా? అనేది కేంద్రం స్పష్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తామన్నారు. బండి సంజయ్ దొంగ మాటలు మాని వడ్లపై మాట్లాడాలన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

యాసంగిలో వరి పంట వేయొద్దని రైతులకు మరోసారి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. బీజేపీ నేతల మాటలు వింటే ఆగమైపోతారని హెచ్చరించారు. తాను రైతులు మంచి కోసం చెబుతున్నానని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేసే స్థితిలే లేదన్న కేసీఆర్, రైతులు వరి వేసి ఆగం కావొద్దన్నారు. సీడ్ కంపెనీతో, మిల్లర్లతో టైఆప్ ఉన్నవారు వరి పండించి అమ్ముకోవచ్చన్నారు. మీ మీద మీకు నమ్మకం ఉంటే పండించుకోండి లేదంటే వద్దు అని కేసీఆర్ తేల్చి చెప్పారు.

వ‌డ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ”తెలంగాణ‌లో 3 కోట్ల ట‌న్నుల ధాన్యం కొన‌నని చెబుతున్నావ్. ఇది నీ చేత‌కాని త‌నం కాదా? కేంద్రం వ‌డ్లు కొనాల‌ని వ‌చ్చే శుక్ర‌వారం అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ధ‌ర్నాలు చేప‌డుతాం. ల‌క్ష‌లాది మంది రైతుల‌తో క‌లిసి ధ‌ర్నాలు చేయ‌బోతున్నాం. వ‌డ్లు కొంట‌వా? కొన‌వా? అనేది తేలాలి. రైతుల‌తో క‌లిసి పోరాడుతాం. శుక్ర‌వారం మాతో క‌లిసి నువ్వు కూడా ధ‌ర్నాకు కూర్చుంటావా? తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే.

FB Own Survey : ఫేస్‌బుక్‌‌తో 36 కోట్ల మందికి రిస్క్!

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం. మా ప్రాణం పోయే వ‌ర‌కు తెలంగాణ కోసం, రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం. మీ తాత జేజ‌మ్మ ఎవ‌రున్నా వ‌దిలిపెట్టం. ఈ దేశ ఖ‌జానాలో మా వాటా ఉంది. ఈ దేశం మీ అయ్య సొత్తు కాదు. మిమ్మ‌ల్ని వ‌ద‌లం, వేటాడుతాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వ‌ర‌కు పోరాడుతాం. మీరు వ‌డ్లు కొనం అంటే మీకు ఓటేయ్యాలా? వ‌ద్దా? అనేది ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటారు. తెలంగాణ రైతులు, ప్ర‌జలు కేసీఆర్‌ను న‌మ్ముతున్నారు. మీరు డిపాజిట్లు కోల్పోయారు” అని కేసీఆర్ అన్నారు.

త్వ‌ర‌లోనే 70వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు..
సీఎం కేసీఆర్ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త వినిపించారు. త్వ‌రలోనే 60 నుంచి 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మి నిరుద్యోగులు మోస‌పోవ‌ద్దు, ఆందోళనకు గురి కావొద్దన్నారు. ”నిరుద్యోగుల‌కు నేను చెప్తున్నా.. మంచి ఉద్యోగ క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఉద్యోగ నియామ‌కాలకు క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ద‌క్కేలా నిబంధ‌న‌లు రూపొందించాం. నిరుద్యోగుల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మేలు చేస్తోంది.

జోన‌ల్ విధానం ప్ర‌కారం ఉద్యోగుల‌ను స‌ర్దుతున్నాం. ఒక‌ట్రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తాం. న‌వంబ‌ర్‌లో ఉద్యోగుల స‌ర్దుబాటు ప‌క్రియ పూర్తి చేసి.. 60 నుంచి 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు ఇస్తాం. ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం. పార‌ద‌ర్శ‌కంగా ఉద్యోగ నియామ‌కాలు జ‌రుపుతాం. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. బండి సంజ‌య్ ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడుతున్నాడు” అని సీఎం కేసీఆర్ అన్నారు.

Related Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

Latest Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....