Friday, January 21, 2022

అనుష్క@ 40 ఇయ‌ర్స్..హ్యాపీ బ‌ర్త్ డే స్వీటీ..


టాలీవుడ్ బొమ్మాళి,టాలీవుడ్ దేవ‌సేన‌..అందాల జేజ‌మ్మ‌..ముద్దుగా స్వీటీ..ఇప్ప‌టికే మీకు అర్థ‌మ‌యి ఉంటుంది క‌దా..ఆమె ఎవ‌ర‌నేది. ఆమె అనుష్క‌శెట్టి.. న‌వంబ‌ర్ 7 అనుష్క పుట్టిన‌రోజు. 1981లో పుట్టిన ఈ భామ‌.. ఈ ఏడాదితో 40వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతోంది. అనుష్క ఫ్యామిలీలో ఎక్కువ‌గా డాక్ట‌ర్స్..ఇంజ‌నీర్సే ఉన్నారు. అనుష్క ఒక్క‌రే సినిమాలోకి వ‌చ్చారు. అనుష్క ప్రాధ‌మిక విద్య‌తో పాటు హైస్కూల్,కాలేజ్,డిగ్రీ మొత్తం మంగుళూరులోనే సాగింది.. . 2005లో “సూప‌ర్” సినిమాతో టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అయింది అనుష్క‌. ఈ చిత్రంలో అనుష్క‌ని చూసిన ప్రేక్ష‌కులు ఆమె నాజుకు అందాల‌కి ఫిదా అయిపోయారు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించాడు. పూరీ వ‌ల్లే అనుష్క టాలీవుడ్ కి ప‌రిచ‌యం అయింది. టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున కూడా అనుష్క కెరీర్ కి బాట‌లు వేశారు. అందుకే నాగార్జున న‌టించిన పలు చిత్రాల్లో గెస్ట్ రోల్ అయినా మెరుస్తుంటుంది ఈ క‌న్న‌డ బ్యూటీ.

సూప‌ర్ చిత్రం త‌ర్వాత హీరో సుమంత్ న‌టించిన మ‌హానంది చిత్రంలో హీరోయిన్ గా న‌టించింది. ఈ రెండు సినిమాలు పెద్ద‌గా క్రేజ్ తీసుకురాలేక‌పోయాయి. కాగా విక్ర‌మార్కుడు చిత్రంలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కి జోడీగా న‌టించింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2009లో వ‌చ్చిన అరుంధ‌తి మూవీతో అనుష్క టాప్ హీరోయిన్ అయిపోయింది. యువ‌రాణిగా అనుష్క అభిన‌యానికి,అందానికి ప్రేక్ష‌కులు మైమ‌ర‌చిపోయారు. దాంతో ఎంతోమంది అనుష్క‌ని అభిమానించ‌డం అన‌డం కంటే ఆరాధ‌కులుగా మారిపోయారు.ఇక ఆ తర్వాత ‘రుద్రమదేవి’ చిత్రంలో తన రాజసాన్ని ఒలకబోసింది ఈ బ్యూటీ. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు మ‌ళ్లీ ఊపు తీసుకొచ్చిన హీరోయిన్ ఎవ‌రంటే అనుష్క పేరే చెప్పాలి.. ఇక స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్నా కూడా వేశ్య పాత్ర‌లో న‌టించ‌డం , ఆ పాత్ర‌కి ఎనలేని పేరురావ‌డం తెలిసిందే. ఆ చిత్రం వేదం.. అయితే అరుంధ‌తి లాంటి సినిమా త‌ర్వాత వెంట‌నే బిల్లాలో బికినీ వేసిన ఘ‌న‌త అనుష్క సొంతం. ఆ త‌ర్వాత “పంచాక్ష‌రి”, “రుద్ర‌మ‌దేవి”, “భాగ‌మ‌తి”, “సైజ్ జీరో” లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టించింది. మ‌రోవైపు సింగం లాంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ గ్లామ‌ర్ ఒల‌క‌బోసింది. స్టార్ డైరెక్ట‌ర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘భాగమతి’గా పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ..హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమా చేసింది. ఈ చిత్రం పెద్ద‌గా ఆడ‌లేదు.. ఆత‌ర్వాత ఏ సినిమాకి సంత‌కం చేయ‌లేదు అనుష్క‌..కాగా యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టితో ఓ చిత్రంలో అనుష్క న‌టించ‌నుంద‌నే టాక్ వ‌చ్చింది. ఆ ప్రాజెక్ట్ ఇప్ప‌టివ‌ర‌కు ప‌ట్టాలెక్క‌లేదు.. పాత్ర ఏదైనా..ఆ పాత్ర ఎటువంటిదైనా త‌న‌దైన‌శైలిలో ఆ పాత్ర‌లో ఒదిగిపోయే త‌త్వం అనుష్క‌ది. అంతేకాదు ఇండ‌స్ట్రీలో అంద‌రితో క‌లుపుగోలుగా ఉంటూ..అంద‌రి మ‌న‌నల‌ను పొందుతోంది ఈ క‌న్న‌డ సోయ‌గం. ఈ భామ‌కి సామాజిక సేవ చేయ‌డం, ఇత‌రుల‌కి సాయం చేయ‌డం అంటే చాలా ఇష్టం. ఇక భ‌క్తి కూడా ఎక్కువే. ఫ్యామిలీకి ఎక్కువ‌గా ఇంపార్టెంట్ ఇస్తుంది అనుష్క‌..అయితే 40ఏళ్లు వ‌చ్చినా ఈ భామ ఇంకా కుమారిగానే వున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో అనుష్క‌కి వ‌రుడుని వెతికే ప‌నిలో కుటుంబ‌స‌భ్యులు ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక అనుష్క‌,,ప్ర‌భాస్ ల మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌ని పుకార్లు వ‌చ్చినా తాము స్నేహితులం మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం అనుష్క‌ది.. మ‌రి ఈ ఏడాది అయినా అనుష్క పెళ్ళి చేసుకుంటుదేమో చూడాలి. అనుష్క ఇంకా మంచి చిత్రాలు చేయాల‌ని కోరుకుంటూ..ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది ఆంధ్ర‌ప్ర‌భ‌.

Related Articles

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

Latest Articles

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...