Friday, January 21, 2022

TSRTC : సార్..చిల్లర తీసుకోలేదు..అంటూ సజ్జనార్‌‌కు ట్వీట్ | Passenger who tweeted to Sajjanar

సార్…బస్సులో కండక్టర్ కు రూ. 100 ఇచ్చాను…చిల్లర తీసుకోవడం మరిచిపోయాను.. ఆ డబ్బు పంపించాలంటూ..ఓ స్టూడెంట్…ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్వీట్ చేశాడు.

RTC MD Sajjanar : సార్…బస్సులో కండక్టర్ కు రూ. 100 ఇచ్చాను…చిల్లర తీసుకోవడం మరిచిపోయాను.. ఆ డబ్బు పంపించాలంటూ..ఓ స్టూడెంట్…ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన ఆయన…డిపో అధికారులకు సమాచారం అందించారు. వారు విచారణ చేసిన అనంతరం..మిగిలిన డబ్బులను ఆ విద్యార్థికి ఫోన్ పే ద్వారా అందించారు. ఈ ఘటన జీడిమెట్ల పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న..నెటిజన్లు ఆర్టీసీ ఎండీ, సంస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More : Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు ‘బసవశ్రీ’ పురస్కారం

వివరాల్లోకి వెళితే…

సీతాఫల్ మండికి చెందిన లిక్కిరాజు..గురువారం బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల బస్సు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కండక్టర్ కు రూ. 100 ఇచ్చాడు. చిల్లర లేదని టికెట్ వెనుక…రూ. 80 రాశాడు. అయితే..సికింద్రాబాద్ రాగానే..లిక్కిరాజు దిగిపోయాడు. దిగిన తర్వాత..చిల్లర తీసుకోలేదని తెలుసుకున్నాడు. అప్పటికే బస్సు వెళ్లిపోయింది. జేబులో ఒక్క రూపాయి లేకపోవడంతో నడుచుకుంటూ..ఇంటి వరకు వెళ్లాడు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్యాగ్ చేస్తూ…తన బాధ వెళ్లగక్కాడు. వెంటనే స్పందించిన ఆయన..జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డిని పరిశీలించాలని సూచించారు. శనివారం ఆ ప్రయాణికుడికి చెల్లించాల్సిన రూ. 80ని..డిపో మేనేజర్ ఫోన్ పే ద్వారా పంపించారు. ఎంపీ, డిపో మేనేజర్ల స్పందనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More : T20 World Cup 2021 : కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికాదే విజయం.. అయినా ఇంటికే..

సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. [email protected] మెయిల్‌ ఐడీలో కానీ, @tsrtcmdoffice ట్విట్టర్‌ ఖాతా ద్వారా కానీ, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు.  సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి జగన్ ఇచ్చిన హామీలన్నీ ఉత్తుత్తివేనా ? పేర్ని నాని అలా తీసి పడేశారేంటి ?

సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్‌ సమావేశం అయ్యానని చిరంజీవి ప్రకటించారు. తాము ఏమేమీ మాట్లాడుకున్నామో వివరించారు. తాను చెప్పినవన్నీ సీఎం జగన్...

Ravi Teja Mother : రవితేజ తల్లిపై కేసు నమోదు

ప్రధానాంశాలు:సినిమాలతో రవితేజ బిజీవార్తల్లో రవితేజ తల్లిఅక్రమంగా నిర్మాణపై కేసుసినిమాలతో తప్పా వ్యక్తిగత విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన ఫ్యామిలీ కూడా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించదు. ఆ మధ్య...

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Latest Articles

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

దిగ్విజయంగా విలీన ఘట్టం.. జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో అమర్ జవాన్ జ్యోతి

ప్రధానాంశాలు:చారిత్రక ఘట్టమన్న కేంద్ర ప్రభుత్వంజ్యోతుల విలీనం సరికాదన్న విపక్షాలురెండు జ్యోతులు ఎందుకు ఉండకూడదన్న నేతలున్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని దానికి సమీపంలో ఉన్న జాతీయ...