Friday, January 28, 2022

T.Congress : హుజూరాబాద్ ఫలితంపై హై కమాండ్ సీరియస్.. నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం | Huzurabad by Pole High Command Serious


హుజూరాబాద్ బై పోల్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్‌లో రీ సౌండ్ చేస్తోంది. ఫలితం ఘోరంగా రావడంతో.. ఇంటా బయటా పోరును హస్తం పార్టీ తట్టుకోలేకపోతోంది.

Huzurabad by Pole: హుజూరాబాద్ బై పోల్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్‌లో రీ సౌండ్ చేస్తోంది. ఫలితం ఘోరంగా రావడంతో.. ఇంటా బయటా పోరును హస్తం పార్టీ తట్టుకోలేకపోతోంది. సాంప్రదాయ ఓటును కూడా కాపాడుకోలేకపోవడంపై.. హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఏఐసీసీ.. ఓటమిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓటములు కొత్తేమీ కాదు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా.. రెండు ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో కాంగ్రెస్‌కు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.

Read More : Film Festival : భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైన ఏకైక తెలుగు సినిమా

అక్కడ గెల్చి.. పార్టీ పునర్ వైభవానికి బాటలు వేయాలని కలలు కన్నా.. కేవలం మూడు వేల ఓట్లకే పరిమితం కావడాన్ని హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్.. ఈ ఉపఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో.. హుజూరాబాద్ ఫలితంపై హైకమాండ్ కన్నెర్ర చేసింది. తెలంగాణపై గంపెడు ఆశలు పెట్టుకుంటే.. ఇదేం రిజల్ట్ అంటూ ముఖ్యనేతలకు అధిష్టానం తలంటింది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం, ఓటింగ్ సరళి, ఫలితం వరకు.. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర నాయకత్వాన్ని ఏఐసీసీ ఆదేశించింది.

Read More : Kuppam : మళ్లీ హీటెక్కిన ఏపీ రాజకీయాలు, కుప్పం కొట్లాట

దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలే సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా మెరుగైన ఫలితాలే వచ్చాయి. కానీ.. హుజూరాబాద్ విషయాన్ని రాష్ట్ర నేతలే కాకుండా.. అధిష్టానం కూడా జీర్ణించుకోలేకపోతోంది. నాయ‌క‌త్వం విష‌యంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా,.. ఇదేం ప‌రిస్థితి అంటూ సీరియ‌స్ అయింది. రిజల్ట్ రోజే ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్రటరీ వేణుగోపాల్… రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు ఫోన్ చేసారు. డిపాజిట్ కూడా కోల్పోవడం ఏంటీ అంటూ సీరియస్ అయ్యారు. అయితే.. ఠాగూర్ మాత్రం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌న‌కు అందుబాటులోకి రావ‌డం లేదంటూ వేణుగోపాల్‌కు స‌మాధానం ఇచ్చి జారుకున్నారట. మరోవైపు.. గాంధీ భవన్‌లో నిర్వహించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో సీనియర్లు కూడా సీరియస్ అయ్యారు.

Read More : T20 World Cup 2021 : స్కాట్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ.. రన్‌రేట్ మరింత మెరుగు

వీహెచ్ లాంటి సీనియర్లతో పాటు.. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ కూడా గట్టిగానే నిలదీశారు. ఎన్నడూ లేంది.. ఉత్తమ్ గట్టిగా రియాక్ట్ కావడంతో.. మాణిక్కం ఠాగూర్, రేవంత్ కూడా సైలెంట్ అయిపోయారట. గత ఉప ఎన్నికల్లో పార్టీ ఓట‌మి పాలైతే… కోవ‌ర్టులు అంటూ ప్రచారం చేశారు.. మ‌రీ ఇప్పుడు కోవ‌ర్టులు ఎవ‌రు అంటూ ఉత్తమ్ గ‌ట్టిగా నిల‌దీయడంతో ఖంగుతినడం నేతలవంతైంది. సాంప్రదాయ ఓటు గల్లంతవడం, కేవలం మూడు వేల ఓట్లే రావడం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారట. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమి ఒకెత్తయితే.. బీజేపీ ఘన విజయం సాధించడంపై హస్తం హై కమాండ్ సీరియస్‌గా ఉంది. మరి నివేదిక ఎప్పటిలోపు పూర్తవుతుంది. అందులో ఏ ఏ అంశాలను ఓటమికి కారణాలుగా పేర్కొంటారు. ఈ ఫలితం ముందు ముందు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

Latest Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...