Sunday, January 23, 2022

Bhadradri Kothagudem : అదృశ్యమైన వ్యక్తికి అంత్యక్రియలు.. 12 గంటల తర్వాత తిరిగొచ్చాడు | tractor driver escaped from home parents perform funerals unknown dead body

అదృశ్యమైన వ్యక్తి మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Bhadradri Kothagudem : యజమాని తిట్టడంతో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. అదృశ్యమైన తర్వాత కొద్దీ రోజులకు గుర్తు పట్టలేని స్థితిలో ఓ మృతదేహం కనిపించింది. అయితే అదృశ్యమైన వ్యక్తే మృతి చెందని భావించిన కుటుంబ సభ్యులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది జరిగిన 12 గంటల తర్వాత అదృశ్యమైన వ్యక్తి ఇంటికి వచ్చాడు. దీంతో అందరు అవాక్కయ్యారు. ఘటన వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడుకు చెందిన బొడ్డు ప్రసాద్ ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామంలోని ఓ రైతు దగ్గర పనిచేస్తున్నాడు.

చదవండి : Murder Case : “చెప్పు” సాయంతో హత్యకేసును ఛేదించిన పోలీసులు

ఈ క్రమంలోనే యజమానికి.. ప్రసాద్‌కి మధ్య గొడవ జరిగింది.. ఈ సమయంలోనే ప్రసాద్‌‌పై చేయి చేసుకున్నాడు యజమాని.. అతడికి గాయాలు కావడంతో చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించాడు.. అయితే కొద్దీ రోజుల తర్వాత ప్రసాద్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల గ్రామాల్లో వెతికి ఈ నెల 2తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నెల 3తేదీన తాలిపేరు ప్రాజెక్టులో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.. ఆ మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.. దీంతో పోలీసులు ప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

చదవండి : Murder : దారుణం.. పొట్టిగా ఉందని ఫ్రెండ్స్ హేళన చేయడంతో ప్రియురాలిని చంపేశాడు

మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులు ప్రసాద్‌గా పొరబడ్డారు. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం ప్రసాద్ యజమానిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.. అయితే శుక్రవారం ప్రసాద్ చర్లలో ప్రత్యేక్షం కావడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు అవాక్కక్కరు. అయితే యజమాని మళ్లీ కొడతాడనే భయంతో తానూ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామానికి వెళ్లి దాక్కున్నాని ప్రసాద్ తెలిపాడు.

చదవండి : Maharashtra : కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10కి చేరిన మృతుల సంఖ్య

అయితే ప్రసాద్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మృతదేహానికి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నట్లు, పోలీసులు గుర్తించారు. ఇక ఆ మృతదేహం ఎవరిదో గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...