Sunday, January 16, 2022

Girl baby died in drainage : అమావాస్య నాడు పుట్టిన ఆడపిల్ల..బొడ్డుతాడు కూడా కోయని పసిగుడ్డు డ్రైనేజీలో పారేసిన దారుణం Just born girl baby died in drainage

అమావాస్య నాడు పుట్టిన ఆడపిల్ల. .బొడ్డు తాడు కూడా కోయని పసిగుడ్డు డ్రైనేజీలో పారేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

Just born girl baby died in drainage  : ఆడపిల్ల అంటేనే చిన్నచూపు. నిర్ధాక్ష్యిణ్యంగా చంపేస్తున్న సమాజం. అటువంటి ఈ సభ్య సమాజంలో దీపావళి అమావాస్య రోజున ఓ ఆడపసిగుడ్డు బతుకు తెల్లారిపోయింది. బొడ్డుతాడు కూడా కోయకుండా ఆడబిడ్డను డ్రైనేజీలో పారేసిన దారుణ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. శీతకాలం చలి వణికిస్తుండగా ఓ బిడ్డ ఈ భూమ్మీద పడింది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ పసిగుడ్డు రోడ్డు పక్క డ్రైనేజీలో బతకటానికి పోరాడాల్సి వచ్చింది. నూరేళ్లు కాదు పుట్టిన కొన్ని గంటలు కూడా గడవకుండానే చలిలో..వానలో వణికి వణికి..గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ప్రాణాలు కోల్పోయిందా పసిగుడ్డు. జోరు వాన.. వణికించే చలి.కంపు కొట్టే డ్రైనేజీలో తల్లడిల్లి చావుతో పోరాడి.. చివరికి ఓడిపోయింది. బొడ్డు కూడా కోయని ఆ పసిగుడ్డు కాపాడిన కొద్ది సేపటికే కన్నుమూసిన అత్యంత అమానవీయ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది.

Read more : newborn baby In box : రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా అట్టపెట్టెలో పసిబిడ్డ..

చీరాల సిటీలోని శ్రీరాం నగర్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో గురువారం (నవంబర్ 4,2021) ఆడశిశువును స్థానికులు గుర్తించారు. ఉదయం నుంచి జోరువాన కురుస్తుండటంతో ఎవరూ ఆ శిశువును గమనించలేదు. పది గంటల తర్వాత వాన తెరపివ్వడంతో అటువైపు వెళ్తున్న ఓ యువకుడికి డ్రైనేజీలోంచి ఏడుపు వినిపించింది. దీంతో గబగబా అక్కడికి వెళ్లి చూడగా బట్టల్లో చుట్టి ఉన్న పసిపాప కనిపించింది. వెంటనే ఆ శిశువును బయటకు తీసి హాస్పిటల్ కు తరలిస్తుండగా కొద్ది క్షణాలకే ఆ శిశువు కన్నుమూసింది.

Read more : Bengaluru Tragedy :ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..ఆకలితో అల్లాడి చనిపోయిన పసిబిడ్డ

ఈ ఘటనపై పోలీసులకు సదరు యువకుడు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం ఎవర్నా ప్రసవించారా? గర్భిణికులుగా ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలు సేకరించారు.పసిబిడ్డను అక్కడ పారేసిన నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఇటువంటి దారుణ ఘటనలు ఎన్నో ఎన్నెన్నో.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...