Sunday, January 23, 2022

Samantha : ఆ బాధ నుండి బ‌య‌ట‌ప‌డి స‌మంత మ‌ళ్లీ మొలెట్టిందిగా.. వైరల్ వీడియో..! | The Telugu News

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, నాగచైతన్య, సమంత ఇరువురు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. ఇకపోతే విడాకులు ఇవ్వాలనే ఆలోచన చాలా బాధతో తీసుకున్న నిర్ణయమని సమంత గతంలోనే పేర్కొంది. ఈ క్రమంలోనే ఆ బాధ నుంచి బయటపడేందుకుగాను సమంత ప్రయత్నిస్తున్నట్లు కనబడుతున్నది.తాజాగా సమంత హైదరాబాద్‌లోని తన ఇంట్లో దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్‌గా పలు సినిమాల్లో బిజీ‌గా ఉన్న సమంత..ఫిజికల్, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేందుకు ట్రై చేస్తోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా పలు మోటివేషనల్ మెసేజెస్ పెడ్తూ.. తాను చాలా బిజీగా ఉన్నట్లు చెప్పకనే చెప్తున్నది సమంత.

samantha New Gym work outs video viral

ఈ క్రమంలోనే ఫిజికల్ ఫిట్ నెస్ కోసం జిమ్‌లో కసరత్తలు చేస్తోంది నాగచైతన్య మాజీ భార్య. గతంలో నాగచైతన్యతో కలిసి జిమ్ వర్కవుట్స్ చేసిన సమంత.. ప్రజెంట్ ఒక్కతే వర్కవుట్స్ చేస్తోంది. వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. మొత్తంగా సమంత తన వ్యక్తిగత, వృత్తి విషయాల్లో శ్రద్ధ కనబరుస్తూ.. నాగచైతన్యతో విడాకుల బాధ నుంచి బయటపడుతున్నట్లు కనబడుతున్నది. సమంత ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతున్నదని నెటిజన్లు అంటున్నారు. సమంత సినిమాల విషయానికొస్తే.. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’, కోలీవుడ్ సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’ పూర్తి చేసిన సమంత.. త్వరలో బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించబోతున్నది. హిందీ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.

Samantha : నెట్టింట సమంత జిమ్ వర్కవుట్స్ వీడియో సందడి..

samantha New Gym work outs video viral
samantha New Gym work outs video viral

‘ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్2’ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయిన సమంత.. ఆ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో మరో ఫిల్మ్ చేయబోతున్నట్లు బీ టౌన్ సర్కిల్స్ టాక్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో సమంత చేసిన పాత్రకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆ సిరిస్ ద్వారా సౌత్‌తో పాటు నార్త్‌లోనూ సమంత అభిమానులను సొంతం చేసుకుంది.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...