Wednesday, January 19, 2022

TDP : మళ్లీ బీజేపీతో పొత్తుకు టీడీపీ సై.. నై అంటున్న కమలనాథులు? | The Telugu News

TDP : 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. కానీ, 2019 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ, జనసేనలతో పొత్తులో లేకుండా ఒంటరిగానే బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అలా ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన టీడీపీ ప్రస్తుతం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది.టీడీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ వేసుకుని మరి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది.

TDP

అయితే, బీజేపీలోని ఓ వర్గం మాత్రం టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవడం లేదని,అందుకే ఇటీవల ఢిల్లీలో బీజేపీ ఏపీ వ్యవహారాలు చేసుకునే ఇన్‌చార్జి, సీనియర్ నేత సునీల్ దేవధర్ మీడియా సమావేశం పెట్టి మరి టీడీపీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో టీడీపీ బీజేపీ పొత్తు గురించి ఆసక్తి కర చర్చ జరుగుతున్నది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ టీడీపీ అప్పుడే పొత్తుల గురించి ఆలోచన చేస్తుందా? అని అనుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులో ఉండి కొన్ని స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు మళ్లీ ఆనాటి పొత్తు కాంబినేషన్ అనగా టీడీపీ-బీజేపీ-జనసేన తెరమీదకు వస్తుందేమోననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.

TDP : కమలంతో పొత్తు ఉండాలని ప్లాన్..!

BJP
BJP

కాగా, బీజేపీని పొత్తుకు ఒప్పిస్తే జనసేన ఆటోమేటిక్‌గా పొత్తులో భాగస్వామి అవుతుందనే వాదన కూడా వినబడుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు చివరి నిమిషం వరకు పొత్తుకు ప్రయత్నిస్తారని పలువురు అనుకుంటున్నారు.అయితే, చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే, రాష్ట్రనాయకత్వం సలహా, సంప్రదింపులు లేకుండానే బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకు భవిష్యత్తులో సై ..అంటుందా చూడాలి మరి..

Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

RRC CR Jobs | రైల్వే శాఖలో భారీగా ఖాళీలు – Telugu Job Alerts 24

RRC CR Recruitment 2022 Notification : RRC CR సెంట్రల్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Latest Articles

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...