Friday, January 28, 2022

Srisailam : రేపటి నుండి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు |Karthika Masotsavam in Srisailam from tomorrow

కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులివ్వనున్నారు.

Srisailam : ప్రముఖ శైవక్షేత్రం, శక్తిపీఠం శ్రీశైల క్షేత్రంలో రేపటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాలు డిసెంబర్‌ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. మల్లికార్జునస్వామి గర్భాలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేయగా.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు. గర్భాలయ అభిషేకాలను రద్దు చేశారు. రోజుకు నాలుగు విడుతల్లో ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నారు.

కార్తీక మాసం ప్రారంభ సూచికగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగించనున్నారు. ఈ మాసమంతా ఆలయంలో దీపాన్ని వెలిగించనున్నారు. ఉత్సవాల్లో కాంప్లెక్స్‌లో దర్శనం కోసం బారులు తీరిన భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించనున్నారు. అలాగే అఖండ శివచతుస్సప్తాహ భజన కార్యక్రమంతోపాటు, నిరంతరంగా శివభజనలు కొనసాగనున్నాయి.

కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులివ్వనున్నారు. భక్తులు కార్తీక దీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయ దక్షిణ మాడవీధిలో, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

Latest Articles

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...