Friday, January 28, 2022

Chandrababu: వారికి హ్యాట్సాఫ్.. మీరూ కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు -చంద్రబాబు | TDP chief Chandrababu Naidu Warns Officials Over illegal Activity

Chandrababu: పకడ్బంధీగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదని, అందుకే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా ప్రభుత్వం నియమించిందని చంద్రబాబు విమర్శించారు.

జగన్ రెడ్డి చెప్పిందల్లా చేద్దామనుకుంటే తమ అంతం ప్రారంభమవుతుందని అధికారులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు చంద్రబాబు. ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటే ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

కోర్టులు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు చంద్రబాబు. అధికారులు ప్రభుత్వం చేసే అడ్డగోలు పనులకు సహకరించకుండా.. తాము ఐఏఎస్ అధికారులమనే విషయాన్ని కొందరు గుర్తుంచుకోవాలని అన్నారు చంద్రబాబు. కొంతమంది అధికారులు మాత్రం ప్రభుత్వం చెప్పే అడ్డగోలు పనులు చేయమని చెప్పేస్తున్నారని అన్నారు. నిజాయితీగా ఉండే అధికారులకు హ్యాట్సాఫ్ అన్నారు.

ప్రభుత్వం చెప్పే తప్పుడు పనులు చేసి అధికారులు కూడా కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు చంద్రబాబు. చిన్నపాటి విమర్శలు వచ్చినా అధికారులు రాజీనామాలు చేసిన ఘటనలు ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎన్ని తిట్టినా చలనం లేదని, ఎన్నికల్లో అక్రమాలు ఎందుకు చేస్తున్నారు అని నిలదీశారు. అంత సరదాగా ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రండి.. తేల్చుకుందాం.. అని సవాలు విసిరారు.

The post Chandrababu: వారికి హ్యాట్సాఫ్.. మీరూ కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు -చంద్రబాబు appeared first on 10TV.

Related Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...