Sunday, January 23, 2022

గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డ్ ..

హీరోయిన్ త్రిష ఓ రికార్డ్ ని నెలకొల్పింది. ఆమెకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది. ఈ వీసా అందుకున్న తొలి తమిళనటిగా త్రిష రికార్డులకెక్కారు. ఈ విషయాన్ని త్రిష తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ విషయాన్ని వెల్లడించగానే త్రిషకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీకపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మల్లిక్, మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ నేపథ్య గాయని కేఎస్ చిత్ర వంటివారు ఇప్పటి వరకు యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటి మాత్రం త్రిష కావడం విశేషం.  2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్‌ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని 5 లేదంటే 10 ఏళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వాటంతట అవే రెన్యువల్ అవుతాయి. అయితే త్రిషకి ఇకపై ఇండియాతో పాటు యూఏఈలో కూడా ఉండొచ్చన్న మాట.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...