Sunday, January 23, 2022

Telangana Vaccine : తెలంగాణాలో దీపావళి రోజు వాక్సిన్‌కు హాలిడే.. telangana health dept declares covid 19 vaccine holiday on diwali

దీపావళి పండగ సందర్భంగా తెలంగాణ లో రేపు వాక్సినేషన్ కు ఆరోగ్యశాఖ సెలవు ప్రకటించింది. వైద్య సిబ్బందికి దీపావళి రోజున సెలవు ప్రకటించింది.

Telangana Vaccine : దీపావళి పండగ సందర్భంగా తెలంగాణ లో రేపు (నవంబర్ 4,2021) వాక్సినేషన్ కు ఆరోగ్యశాఖ సెలవు ప్రకటించింది. దీపావళి పండగ సందర్భంగా నవంబర్ 4న వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇచ్చారు. దీంతో గురువారం అంటే దీపావళి రోజున కోవిడ్ వాక్సినేషన్ ఇస్తున్న వైద్య సిబ్బంది విరామం దొరికింది. ఒక్కరోజు వ్యాక్సినేషన్ కు సెలవు దొరికింది. కానీ శుక్రవారం నుంచి తిరిగి యధావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని వైద్య అధికారులు వెల్లడించారు. అలాగే దీపాలు వెలిగిస్తున్న సమయంలో శానిటైజర్స్ ఉపయోగించవద్దని వైద్య అధికారులు ప్రజలకు సూచించారు.

Read more : Diwali : దీపావళిరోజు ఆడపడుచులు హారతి ఇవ్వటం వెనుక అసలు కధేంటంటే?…

కాగా తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ చాలా తగ్గింది. కేసులు నమోదు తగ్గటంతో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉదృతి తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. ఒక్కోరోజు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఓరోజు ఎక్కువగా నమోదవుతుంటే మరోరోజు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి.అక్టోబర్ లోనే థర్డ్ వేవ్ వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. కానీ అటువంటి ఛాయలేవీ కనిపించకపోవటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు కాస్త ఊపిరి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇక థర్డ్ వేవ్ ప్రమాదం ఉండదనే ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు చాలా రోజుల క్రితమే కరోనా గురించి ఆందోళన చెందటం మానివేసి సంతోషంగా ఉన్నారనే చెప్పాలి.

Read more : Dhanteras: ధన్‌తేరాస్ స్పెషల్, మేకింగ్ ఛార్జీలు లేవు.. వెయ్యి రూపాయల గిఫ్ట్ వౌచర్

ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ టీకా ఇచ్చే దిశగా చర్యలు వేగవంతం చేసింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో ప్రజలను చైతన్య పరిచేలా ప్రభుత్వ పటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగిస్తోంది.ప్రస్తుతం కరోనా నివారణ కోసం శానిటైజర్ లేని ఇల్లు లేదు. ఈక్రమంలో గత ఏడాది దీపావళి కంటే ఈ ఏడాది దీపావళిని ప్రజలకు కాస్త ఘనంగా చేసుకునే అవకాశముంది. అలాగే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీపావళి పండగ సందర్భంగా దీపాలను, బాణాసంచా వెలిగించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా చేతులకు శానిటైజర్లను ఉపయోగించవద్దని సూచించారు. శానిటైజర్లలోని ఆల్కహాల్ కు మండే గుణం ఉంటుంది కనుక దీపావళిరోజున దీపాలు వేగిస్తున్న సమయంలో క్రాకర్స్ కలుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని .. ప్రజలకు వైద్య శాఖ  సూచించింది.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...