Sunday, January 23, 2022

Eatala Rajender : జమునమ్మ.. నీ కష్టం ఫలించింది | ఈటల గెలుపులో కీలక పాత్ర | Wife Eatala jamuna Plays Key Role in Eatala Rajender s By Election Victory


తాము పొలం పనికి, కూలీ పనులకు, రోజువారీ పనులకు వెళ్లడం లేదు.. ఈటల ప్రచారానికి వెళ్తున్నామని…………………

Eatala Jamuna : తెలంగాణ రాజకీయాల్లో ఓ కుదుపు. రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన బలమైన రాజకీయ శక్తి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ఓ వ్యక్తిగా తనకున్న చరిష్మాతో, బీజేపీ అండతో ఈటల రాజేందర్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. దానికి అత్యంత కీలకమైన కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేశాయన్నది రాష్ట్రమంతటా జరుగుతున్న చర్చ. టీఆర్ఎస్ బలమైన క్యాడర్ ఓట్లు, పథకాలు-ఆర్థిక లబ్ది పొందిన కుటుంబాల ఓట్లతో గులాబీ పార్టీకి ఓట్లు కూడా భారీగానే పడ్డాయి. ఐతే.. ఈటల సపోర్టర్స్, సానుభూతి పరులు, బీజేపీ ఫాలోవర్స్, యూత్, తటస్త ఓటర్లు అంతా ఈటల రాజేందర్ వైపు మొగ్గారు.

లక్ష ఓట్లు బీజేపీ అభ్యర్థి ఈటలకు… 80వేలకు పైగా ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు పడ్డాయి. వార్ ఈ రెండు పార్టీల మధ్యే కొదమ సింహాల్లా జరిగిందని… జనానికి కూడా ఈ రెండు పార్టీలే కళ్లముందు కదిలాయని.. పోలైన ఓట్లను బట్టి అర్థమవుతోంది. ఐతే… ఈటల 23వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. మరి.. ఆ ఓట్లెవరివి…? ఆ ఎడ్జ్ ఎలా వచ్చింది..? అనేది ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్.
ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే దాదాపుగా నిజమైంది. రెండు పార్టీలకు గంప గుత్తగా ఓట్లు పడతాయనీ… కానీ… జస్ట్ కొన్ని వేల ఓట్ల తేడాతో ఈటల గట్టెక్కుతారని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అవి మహిళల ఓట్లే అవుతాయని కూడా కొందరు పొలిటికల్ విశ్లేషకులు చెప్పారు. ఆ మహిళల ఓట్లు బీజేపీ-ఈటల వైపు ఎలా మళ్లాయనేది ఓ ఆసక్తికరమైన విశ్లేషణ.

Read This : Etela rajender : కుట్రలు చేసినవారు కుట్రలతోనే నాశనమవుతారు : ఈటల భావోద్వేగం

ఈటల జమున. ఈటల రాజేందర్ సతీమణి. జమున హ్యాచరీస్ పై ఆరోపణలు వచ్చింది మొదలు.. ఈటల జమున లైమ్ లైట్ లోకి వచ్చారు. తమ సంస్థపై వచ్చిన కబ్జా ఆరోపణలను ఖండించారు. ఈటల రాజీనామా, ఉపఎన్నికలో పోటీ పరిణామాలన్నింటి వెనుక.. కీలకంగా కనిపించిన పేరు ఈటల జమున.

ఈటల పాదయాత్ర మొదలుకాక ముందే జనంలోకి వెళ్లిపోయారు ఆయన జమున. హుజూరాబాద్, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో ప్రతి గడపను ఆమె తట్టారు. ఈటల రాజేందర్ అంటే మన ఇంటి నాయకుడనీ… దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్న ఈటలకు అండగా నిలవాలంటూ.. ఆమె మహిళా ఓటర్లను కోరుతూ వచ్చారు. ఈటల జమున ఇంటింటి ప్రచారంలో ఎప్పుడూ చూసినా.. వందల మంది మహిళలు కనిపించేవారు.

Read This : Etala Rajender : ఏడోసారి గురితప్పని ఈటె.. అపజయం ఎరుగని రాజేందర్!

నోటిఫికేషన్ వచ్చాక.. ఈటల జమున తమ వ్యూహాలను మరింత అమలుపరిచారు. గ్రామ గ్రామాన మహిళల ప్రచారంలో భాగస్వామ్యం చేశారు. కూలీ పనికి వెళ్లే మహిళలు, పేదింటి మహిళలను ఆకర్షించారు. గ్రామ గ్రామాన సభలు, సమావేశాలు, ర్యాలీల్లో మహిళలను పెద్దఎత్తున కూడగట్టి.. ఓ సెంటిమెంట్ వేవ్ క్రియేట్ చేశారు. తాము పొలం పనికి, కూలీ పనులకు, రోజువారీ పనులకు వెళ్లడం లేదు.. ఈటల ప్రచారానికి వెళ్తున్నామని…. చాలామంది మహిళలు, విద్యార్థినిలు, యువత చెప్పారంటే… ఈటల జమున గ్రౌండ్ లెవెల్ లో ఎంతగా వర్క్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అన్యాయం జరిగింది.. ధర్మం వైపు నిలబడండి అంటూ ఈటల రాజేందర్ చేసిన విజ్ఞప్తిని.. మహిళల్లోకి తీసుకెళ్లారు ఈటల జమున. ఈ ఓట్లే సైలెంట్ గా ఈటల మెజారిటీకి కారణమయ్యారనేది ఓ కీలక విశ్లేషణ. అందుకే.. ఈటల జమునమ్మా.. నీ కష్టం ఫలించిందమ్మా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. గెలిపించినందుకు కృతజ్ఞతగా.. ఈటల జమున, ఈటల రాజేందర్.. ప్రతి మండలం, గ్రామానికి వెళ్లి ధన్యవాద పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...