Sunday, January 23, 2022

Extra Marital Affair : భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం…. | Extra Marital Affair

భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. తనను దూరం పెట్టిందనే కోపంతో…బంగారం నిధిని వెలికితీయాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసి నగలు తీసుకుని ఆమెను హ

Extra Marital Affair : భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. తనను దూరం పెట్టిందనే కోపంతో…బంగారం నిధిని వెలికితీయాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసి నగలు తీసుకుని ఆమెను హత్యచేశాడా ప్రియుడు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్‌ మండలంలోని మల్లాపూర్‌కు చెందిన లక్ష్మీదేవి (41) అనే మహిల గత నెల 22వ తేదీ ఉదయం తన కూతురు స్వాతిని కల్వకుర్తికి చెందిన వెంకటేశ్వరాచారితో కలిసి జడ్చర్లకు తీసుకెళ్లింది.

అక్కడ హాస్టల్ లో కూతురుని వదిలిపెట్టి తిరిగి సాయంత్రం మున్ననూర్ వద్ద బస్సుదిగింది. భార్య ఇంటికి రాకపోవటంతో ఆమె భర్త శంకరయ్య గౌడ్ మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా… బోయిన్ పల్లి శివారులో శీతాఫలాలకోసం వెళ్ళిన రవిప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి పీర్లమాన్యం గుట్టపై మృతదేహం కనిపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి ఆమె కనపడకుండా పోయిన లక్ష్మీ దేవిగా గుర్తించారు. ఘటనా స్ధలంలో ఉన్న ఆనవాళ్లను బట్టి ఆమపై అత్యాచారం జరిగిందని గుర్తించారు. ఒంటిపై గాయాలను బట్టి నిందితుడు హత్య చేసి ఉంటాడని నిర్ధారించుకుని ఆకోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా  కాల్ లిస్ట్ చెక్ చేశారు. మృతురాలు గ్రామంలో భూతవైద్యం చేసేదని తెలుసుకున్నారు. ఆమెకు మల్లాపూర్ కు చెందిన గంగిరెద్దుల వెంకటయ్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్న పోలీసులతో నిజం చెప్పాడు.

Also Read : Eetala Rajendar: నాకు కొందరు సీక్రెట్ గా సపోర్ట్ చేశారు.. వాళ్ల పేర్లు చెప్పను..!

ఇటీవల ప్రియుడ్ని దూరం పెట్టటంతో లక్ష్మీదేవిని హతమార్చి ఆమె ఒంటిమీద నగలు కాజేయాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా పీర్లమాన్యం గుట్టలో బంగారు గనులు ఉన్నాయని వాటని తీయాలని నమ్మించి ఆమెను అక్కడకు తీసుకువెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేసి, పెద్ద బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిమీద ఉన్న ఆరు తులాల బంగారు పుస్తెలతాడు, నక్లెస్‌ తోపాటు తులం చైన్, మూడు గ్రాముల చెవికమ్మలు తీసుకుని పరారయ్యాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...