Friday, January 21, 2022

Badvel By Poll : వైసీపీ అభ్యర్థి విజయం | Badvel-bypoll-ycp-candidate-dr-sudha-win

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.సుధ విజయం సాధించారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Badvel By Poll : బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.సుధ విజయం సాధించారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 02వ తేదీ మంగళవారం ఓట్లను లెక్కించారు. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్థి డా.సుధ స్పష్టమైన అధిక్యం ప్రదర్శించారు. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి ఆమె 68 వేల 492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. అన్ని రౌండ్లలో కలిపి వైసీపీకి 84 వేల 682, బీజేపీకి 16 వేల 190, కాంగ్రెస్ కు 5 వేల 026 ఓట్లు పోలయ్యాయి. ఫ్యాన్ ముందు ఏ గుర్తు నిలవలేకపోయింది. వార్ వన్ సైడ్ గా మారిపోయింది. పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువగా వైసీపీ అభ్యర్థి. డా.సుధకు పోలయ్యాయి.

Read More : YCP Candidate Dr.Sudha : వార్ వన్ సైడ్, భారీ మెజార్టీ దిశగా వైసీపీ

బద్వేల్ లో 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిలబడినా…ఆశించినంత ఫలితాలు రాబట్టలేదు. మొత్తంగ వైసీపీ ఖాతాలో మరో నియోజకవర్గం వచ్చి చేరింది.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...