Saturday, January 22, 2022

TS High Court : వరిసాగుపై కలెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు | telangana high court give judgement on paddy craft

యాసంగి వరిసాగుపై అనుమానాలకు తెరపడింది. వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని.. కొందరు అధికారులు వ్యాఖ్యలు చేయడం రైతులను ఆందోళనకు గురిచేసింది.

TS High Court : యాసంగి వరిసాగుపై అనుమానాలకు తెరపడింది. వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని.. కొందరు అధికారులు వ్యాఖ్యలు చేయడం రైతులను ఆందోళనకు గురిచేసింది. అధికారుల వ్యాఖ్యల నేపథ్యంలో వరిసాగుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు కొందరు రైతులు.

చదవండి : High Court : పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటారో చెప్పండి? సీబీఐపై హైకోర్టు సీరియస్

ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.. వరి విత్తనాలు అమ్మరాదని, దీని విషయంలో కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వరి విత్తనాలను విక్రయించరాదని సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ వ్యాఖ్యలు చేసినట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న హైకోర్టు ఇలాంటి చర్యలు వద్దని కలెక్టర్‌కు మౌఖికంగా చెప్పింది. నిషేధిత జాబితాలో వరి లేనప్పుడు కలెక్టర్‌ వ్యాఖ్యలు సరికాదంది. కోర్టు ఉత్తర్వులు ఉన్నా వరి విత్తనాలు అమ్మే షాపుల్ని తెరవనీయబోమని చెప్పడం న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని అభిప్రాయపడింది.

చదవండి : Allahabad high court: ప్రియురాలి గౌరవాన్ని ప్రియుడే కాపాడాలి!

వరి విత్తనాల అమ్మకాలు, కొనుగోలుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్‌ వ్యాఖ్యలు కోర్టుధిక్కారం కిందకు వస్తుందో లేదో పరిశీలన నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...