Sunday, January 23, 2022

TSRTC : డుగ్గు.. డుగ్గు బండిపై రాలేను.. ఆర్టీసీ బస్సులో వస్తా.. ఇష్టమైతే చేసుకో లేకపోతే లేదంటున్న వరుడు | telangana trc employees campaign in social media

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.

TSRTC : తెలంగాణ ఆర్టీసీని నష్టాల్లోంచి బయటపడేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. పండుగల వేళ స్పెషల్ చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడిపి ఊహించినదానికంటే మూడు కోట్లు అధిక ఆదాయం ఆర్జించింది ఆర్టీసీ. ప్రజలకు దగ్గరయ్యేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు ఆర్టీసీ అధికారులు.

చదవండి : Phone Stopped Bullet: బుల్లెట్ ప్రూఫ్‌లా మారి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్

దసరా వేళ సుఖీభవ వీడియోతో ప్రజలను ఆకట్టుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు మరో కొత్త మేమెతో వచ్చింది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన బులెట్ బండి పాటను తమను అనుకూలంగా మార్చుకొని ఓ మీమ్‌ని తయారు చేసింది. ఇది పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం నుంచి బయటపడాలంటే ఆర్టీసీ ప్రయాణమే మేలనే సంకేతం ఇస్తుంది.

ఇక ఈ మీమ్‌‌లో వరుడు తాను డుగ్గు.. డుగ్గు .. డుగ్గు బులెట్ బండిపై రాలేను ఎందుకంటే పెట్రోల్ రేట్ రూ.120కి చేరింది.. నేను ఆర్టీసీ బస్సులో వస్తా ఇష్టముంటే చేసుకో లేకపోతే లేదు అంటూ వరుడు వధువుకు చెబుతున్నట్లుగా ఉంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు మీ క్రియేటివిటీకి నమస్కారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చదవండి : Bamma Bullet Bandi dance: బుద్దిగా కూర్చున్న తాత..‘బుల్లెట్ బండి’పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మRelated Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...