Sunday, January 23, 2022

YSRCP : బద్వేలు వైసీపీదే.. సుధకు సీఎం జగన్ కంటే ఎక్కువ మెజారిటీ.. | The Telugu News

YSRCP : ఆంధప్రదేశ్‌లో‌ని బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. అధికార పార్టీ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి 90,950 ఓట్ల భారీ ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఎమ్మెల్యేగా విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచి ఓటమి పాలయ్యాయి.2019 సాధారణ ఎన్నికల్లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆ నేపథ్యంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక రాగా, వైసీపీ దివంగత ఎమ్మెల్యే భార్య దాసరి సుధను బరిలో నిలిపింది.

ysrcp sudha won in badwel by poll

కాగా, ఈమె తన భర్త కంటే ఎక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఓట్లను దాసరి సుధ సొంతం చేసుకోవడం విశేషం. పదమూడు రౌండ్లు ముగిసే నాటికి 90 వేల పై చిలుకు ఓట్లు మెజారిటీ రాగా, బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్‌పై సుధ విక్టరీ సాధించింది. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్‌కు 90,110 ఓట్ల మెజారిటీ రాగా, దాసరి సుధకు 90,950 ఓట్ల ఆధిక్యం లభించింది. బద్వేలు అసెంబ్లీ ఎలక్షన్స్ హిస్టరీలోనే డాక్టర్ దాసరి సుధ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంలో అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని ప్రతిపక్ష టీడీపీ, జనసేన బలపరిచన సంగతి తెలిసిందే.

YSRCP : అధికార పార్టీ నేతల సంబురాలు..

Ysrcp
Ysrcp

కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తమ అభ్యర్థులను బరిలో దింపి పోటీలో నిలిచి ఓడిపోయాయి. ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ చేతిలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఓటమి పాలయ్యాయి. 13 రౌండ్లు ముగిసే సరికి వైఎస్ఆర్‌సీపీకి 1,12,072 ఓట్లు రాగా, బీజేపీకి 21,661 ఓట్లు, కాంగ్రెస్‌కు 6217 ఓట్లు వచ్చాయి. భారీ విజయం సొంతం అయిన నేపథ్యంలో అధికార వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...