Friday, January 28, 2022

Badvel By-election : వార్ వన్ సైడా, తొలి మూడు గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం! | Badvel by-election result

ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌కు గాలి అనుకున్నంత వీచే ఛాన్స్ లేదంటోంది కమలం పార్టీ.. మరోవైపు కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల కమిషన్.

Badvel By-Election Result : బద్వేలు బరిలో గెలిచేది ఎవరు ? వార్‌ వన్‌ సైడే అన్న ధీమాలో అధికార వైసీపీ పార్టీ ఉండగా.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌కు గాలి అనుకున్నంత వీచే ఛాన్స్ లేదంటోంది కమలం పార్టీ.. మరోవైపు కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల కమిషన్. బద్వేలు ఉప ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. బద్వేల్‌లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు అధికారులు.. నాలుగు కౌంటింగ్ హాల్స్ లో మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు.. 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

Read More : Huzurabad By Poll : లెక్కింపు ఇలా..రెండు హాళ్లు, మొత్తం 14 టేబుళ్లు, 22 రౌండ్లు

కౌంటింగ్‌ ప్రారంభమైన తొలి మూడు గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలకు ఒకేచోట కౌంటింగ్‌ జరగనుందని ఎన్నికల అధికారులు తెలిపారు.. అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరుస్తామని.. కొన్ని టేబుళ్ళకు రౌండ్ లు  పెరిగే అవకాశం ఉందని.. సూపర్  వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరగనుందన్నారు… రౌండ్ వారీగా ఫలితాలను డిస్‌ ప్లే చేస్తామని.. వర్షం వల్ల కౌటింగ్ కు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

Read More : Telugu States By-poll: నేడు తేలనున్న హుజురాబాద్, బద్వేల్ నేతల భవితవ్యం

ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు ఎన్నికల అధికారులు. బద్వేలులో 68.37 శాతం పోలింగ్ నమోదైంది.. గతంతో పోలిస్తే 8.25 శాతం పోలింగ్‌ తగ్గింది.. బద్వేలులో ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్యే నెలకొంది.. ఈ ఎన్నికలో కచ్చితంగా తమదే గెలుపు అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.. లక్ష మెజారిటీ సాధిస్తామని ధీమాగా ఉన్నారు.. అయితే వైసీపీ అనుకున్నది అనుకునట్టు అన్నిసార్లు జరగదంటున్నారు కమలం నేతలు. కౌంటింగ్‌ ప్రారంభమైన మూడు గంటల్లో గెలుపెవరిది అన్న దానిపై క్లారిటీ రానుంది.. గెలుపు వైసీపీదే అని ఇప్పటికే అనేక సర్వేలు చెప్పినప్పటికి ఆ పార్టీ నేతలు ఆశించిన మెజారిటీ వస్తుందా? లేదా? అన్న దానిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

Related Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...