Friday, January 21, 2022

Niloufer : రూ. 100 కోసం ఆక్సిజన్ తీసేశాడు..చిన్నారి బలి, నీలోఫర్‌లో దారుణం | Niloufer Hospital Boy dies after ward boy removes oxygen support

కేవలం 100 రూపాయలకు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు వార్డుబాయ్ సుభాష్.

Niloufer Hospital Boy Dies : వంద రూపాయల కక్కుర్తి.. మూడేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. కేవలం 100 రూపాయలకు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు వార్డుబాయ్ సుభాష్. దీంతో ఆ చిన్నారి ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరి అయి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణ ఘటన చిన్నారి కుటుంబంతో తీరని విషాదాన్ని మిగిల్చింది.

Read More : Gorakhpur : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రియాంక ఫైర్

ఎర్రగడ్డకు చెందిన మహ్మద్‌ ఆజం కుమారుడు మహ్మద్‌ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో.. కుటుంబసభ్యులు మొదట ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ రెండు, మూడు రోజులకే 2 లక్షల రూపాయల బిల్లు అయ్యింది. దీంతో ఖాజా తలిదండ్రులు మూడు రోజుల క్రితం నిలోఫర్‌లో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో బాలుడికి స్కానింగ్‌ తీయించాల్సి వచ్చింది. అక్కడికి తీసుకెళ్లడానికి ఆక్సిజన్‌ సిలిండర్‌ను సమకూర్చాల్సి వచ్చింది.

Read More : Anubhavinchu Raja: రిలీజ్ డేట్ ఫిక్స్.. రాజ్‌తరుణ్ ట్రాక్‌లో పడతాడా?

100 రూపాయలు అడిగితే ఇవ్వలేదని.. ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న వార్డు బాయ్‌ సుభాష్‌.. ఆ బాలుడికి పెట్టిన ఆక్సిజన్‌ పైపును తీసి పక్కన పడకలో ఉన్న రోగికి అమర్చినట్లు తెలిపారు. వారి వద్ద 100 రూపాయలు తీసుకుని ఈ పనికి పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో కొద్దిక్షణాల్లోనే ఖాజా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చేలోపే ఆ చిన్నారి తుదిశ్వాస విడిచాడు.

Read More : Evaru Meelo Koteeswarulu: హాట్ సీట్ లో దేవిశ్రీ, థమన్.. ఫన్ విత్ బ్రిలియంట్!

ఆగ్రహించిన బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న.. ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు. సిబ్బంది తీరు, వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డ్ బాయ్‌తో పాటు వైద్యులపై చర్యలు తీసుకుని బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరారు. వార్డు బాయ్‌ సుభాష్‌ను సస్పెండ్‌ చేశారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...