Sunday, January 23, 2022

NRI Murder : అమెరికాలో ప్రవాస భారతీయుడి హత్య..రూ. 7ల‌క్షల కోసం కాల్చి చంపిన దుండగుడు | Murder of Non resident indian in America

అమెరికాలో దారుణం జ‌రిగింది. క్యాసినో ఆడి గెలిచిన డ‌బ్బులు కొట్టేయ‌డానికి ప్రవాసభార‌తీయుడిపై ఓ దోపిడి దొంగ కాల్పులు జ‌రిపి చంపేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన‌ అర‌వ‌ప‌ల్లి శ్రీరంగ.

Murder of Non resident indian : అమెరికాలో దారుణం జ‌రిగింది. క్యాసినో ఆడి గెలిచిన డ‌బ్బులు కొట్టేయ‌డానికి ప్రవాసభార‌తీయుడిపై ఓ దోపిడి దొంగ కాల్పులు జ‌రిపి చంపేశాడు. అరెక్స్‌ ల్యాబోరేటరీస్‌ ఫార్మా సంస్థ సీఈఓగా పని చేస్తున్న శ్రీరంగ దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను ఓ దారి దోపిడి దోంగ 80 కిలోమీట‌ర్లు ఫాలో అయి ఇంటికి వెళ్లి మ‌రీ చంపాడు.

ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన‌ అర‌వ‌ప‌ల్లి శ్రీరంగ న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నాడు. ఈ కంపెనీ రీసెర్చ్ ఆర్గనైజేష‌న్ హైద‌రాబాద్‌లోనే ఉంది. త‌యారీ మాత్రమే న్యూజెర్సీలో ఉంది. శ్రీరంగ‌.. ఎజ్‌మైండ్స్‌, ఈపేరోల్ కంపెనీల‌కు కూడా సీఈవోగా ప‌నిచేస్తున్నాడు. 54ఏళ్ల శ్రీరంగ న్యూయార్క్ ప్లెయిన్స్‌బ‌రోలో స్థిర‌ప‌డ్డారు.

Petrol, Diesel Prices : దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..అక్టోబర్ లో 24 సార్లు పెంపు

త‌న ఇంటికి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పెన్సెల్వేనియాకు వెళ్లిన శ్రీరంగ‌..పార్క్ క్యాసినో ఆడి దాదాపు 7 ల‌క్షల రూపాయలు గెలుచుకున్నారు. ఇది గ‌మ‌నించిన ఓ దుండుగుడు శ్రీరంగను ఫాలో అయ్యాడు. అత‌ని కారు వెనుక అనుస‌రిస్తూ అత‌ని ఇంటికి వెళ్లాడు. శ్రీరంగ ఇంట్లోకి వెళ్లగానే బ్యాక్‌డోర్ ప‌గుల‌గొట్టుకుని ఇంటి లోప‌లికి వెళ్లాడు. డ‌బ్బుల కోసం శ్రీరంగ‌తో జ‌రిగిన ఘ‌ర్షణ‌లో అత‌నిపై కాల్పులు జ‌రిపి దుండ‌గుడు పారిపోయాడు.

కాల్పుల శ‌బ్దం విన్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో శ్రీరంగ ఇంటికి వ‌చ్చిన పోలీసులు.. అత‌న్ని హుటాహుటిన ఆస్పత్రికి త‌ర‌లించారు. కానీ తీవ్రగాయాలు కావ‌డంతో అప్పటికే ఆయ‌న మృతి చెందాడు. నిందితుడిని జెకై రీడ్ జాన్‌గా పోలీసులు గుర్తించారు. అత‌న్ని పెన్సెల్వేనియాలో అరెస్టు చేసి న్యూజెర్సీ పోలీసుల‌కు అప్పగించారు.

Related Articles

అది దాచినా దాగదు : శ్రుతి హాసన్

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రుతి హాసన్‌కు మొదటి విజయాన్ని అందించింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. ఆమెను నెత్తిన పెట్టుకుంది కూడా...

ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో. ప్రభాస్ చేసే సినిమాల మీద అంతర్జాతీయ స్థాయి నటీనటుల కన్ను ఉంటుంది. ప్రభాస్ సినిమాలన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంటాయి. అలాంటి ప్రభాస్ ...

Ramesh Babu : ర‌మేష్ బాబు పెద‌క‌ర్మ‌కు హాజ‌రైన మ‌హేష్‌..వైర‌ల్ అవుతున్న ఫొటో!

ప్రధానాంశాలు:రమేష్ బాబు పెద కర్మకు హాజరైన మహేష్కోవిడ్ నుంచి కోలుకున్న మహేష్నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో ర‌మేష్ బాబు మ‌ర‌ణం అనేది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది....

Latest Articles

Mahesh Babu : అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్నవాడు : బాలకృష్ణ

ప్రధానాంశాలు:టాక్ షోతో దుమ్ములేపుతోన్న బాలకృష్ణముగుస్తున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్మహేష్ బాబుపై బాలయ్య కామెంట్స్నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేయడం ఏంటి? అసలు బాలయ్య హ్యాండిల్ చేయగలడా? అందరితో మాట్లాడగలడా? అని కొందరు...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (23-January-2022): ఈరోజులలో కూడా ఎక్కువమంది ఏ పని మొదలు పెట్టాలన్నా, ఫంక్షన్లు శుభకార్యాలు చేయలన్నా.. తమ...