Friday, January 28, 2022

Marri Rajasekhar : మర్రి రాజశేఖర్ మంత్రి అయ్యేనా? కనీసం ఎమ్మెల్సీ పదవైనా వరించేనా? | The Telugu News


Marri Rajasekhar : 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న నేతలు, ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ వారు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు తమకు పార్టీ పదవులు ఇస్తుందని ఆశపడ్డారు. అలా ఆశపడ్డవారిలో వైసీపీ నేత మర్రి రాజశేఖర్ కూడా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం జగన్ అప్పట్లోనే మాటిచ్చారని వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఆయనకు ఇంత వరకూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు.

marri-rajasekhar-ycp-leader-marri-rajasekhar-tipped-for-mlc-and-minister-post

Marri Rajasekhar : తాడేపల్లికి పక్కనే ఉన్నా.. దక్కని అవకాశం..

కమ్మ సామాజికి వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ తొలి నుంచి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్గీయుడిగా ఉన్నాడు. వైఎస్ ఆర్ ఉన్నపుడు మర్రి రాజశేఖర్‌కు పార్టీలో ప్రయారిటీ ఉండేది. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి రాజశేఖర్ … ఆ తర్వాత చిలుకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ మర్రి రాజశేఖర్‌కే దక్కింది. కానీ, మర్రి ఓటమి పాలయ్యాడు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితులు, సమీకరణాల దృష్ట్యా 2019 ఎన్నికల్లో చిలకలూరి‌పేట వైసీపీ టికెట్ విడదల రజనీకి ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అయినప్పటికీ మర్రి రాజశేఖర్ పార్టీ కోసం పని చేశాడు. వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి విడదల రజనీ గెలుపునకు సహకరించాడు. ఈ క్రమంలోనే పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవితో పాటు మినిస్టర్ పోస్టు కూడా ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, అనుకున్నట్లుగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ మర్రి రాజశేఖర్ వైపు సీఎం చూపు పడటం లేదు. వైసీపీలో దురదృష్టవంతుడిగా మర్రి రాజశేఖర్ ఉన్నాడనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఇకపోతే సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి అతి దగ్గర్లోనే మర్రి రాజశేఖర్ ఉన్నప్పటికీ సీఎం చూపు మర్రి రాజశేఖర్ వైపు రావడం లేదు. చూడాలి మరి.. సీఎం జగన్ భవిష్యత్తులోనైనా మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారో లేదో..

Related Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

Latest Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...