Friday, January 28, 2022

Extra Marital Affair : పెళ్లైన 8 ఏళ్లకు వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని భర్తను…. | Extra Marital Affair

పెళ్లైన 8 ఏళ్లకు ఒక మహిళ   వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి వారించాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని   ప్రియుడితో కలిసి  భర్తను హతమార్చింది ఒక ఇల్లాలు.

Extra Marital Affair :  పెళ్లైన 8 ఏళ్లకు ఒక మహిళ   వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి వారించాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని   ప్రియుడితో కలిసి  భర్తను హతమార్చింది ఒక ఇల్లాలు.

వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట మండలం ఎల్లంకొండ గ్రామానికి చెందిన చిన్నమల్కు   శివశంకర్(30)కు వెల్దుర్తి గ్రామానికి చెందిన   శివలీలతో 9 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది.   వీరికి ఇద్దరు కుమారులు,  ఒక కుమార్తె పుట్టారు. శివశంకర్ మద్యానికి బానిసయ్యాడు.  దీంతో రోజు తాగి ఇంటికి వచ్చేవాడు.

భార్య వద్దని వారించేది. దీంతో ఇద్దరి మధ్యరోజూ గొడవలు జరగటం మొదలయ్యింది.  ఈ క్రమంలో భర్తతో విసుగు  చెందిన శివలీల ఏడాది క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది.  అక్కడ తన తల్లి గారింటి  పక్కన ఉండే జహంగీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ  పరిచయం క్రమేపీ వివాహేతర సంబంధానికి దారి తీసింది.  ఈక్రమంలో శివలీల తిరిగి మళ్లీ 7 నెలల   క్రితం భర్త దగ్గరకు తిరిగి వచ్చింది.

Also Read : Live In Relation Partner : తల్లితో సహజీవనం.. కూతురిపై కన్ను… తెలుసుకున్న తల్లి…..!

భర్త వద్దకు  వచ్చిన   కొన్నాళ్లకు జహంగీర్ ఆమె ఇంటికి వచ్చి వెళ్లటం మొదలెట్టాడు.  ఈ విషయం శివశంకర్ దృష్టికి వచ్చింది.  దీంతో  మళ్ళీ భార్యా భర్తల  మధ్య గొడవ మొదలయ్యింది.  దీంతో తమ బంధానికి  అడ్డుగా ఉన్న భర్తను  హత్య చేయాలనుకుంది. ఈవిషయం జహంగీర్ తో చెప్పింది. పథకం ప్రకారం అక్టోబర్ 26న జహంగీర్, శివశంకర్ ను తన స్కూటీపై తీసుకువెళ్లి మద్యం తాగించాడు.

అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి  బండరాయితో తలపై కొట్టాడు . ఆ దెబ్బలకు శివశంకర్  స్పృహ తప్పిపడిపోయాడు. శివశంకర్ చనిపోయాడనుకుని….. ఈవిషయం శివలీలకు ఫోన్ చేసి చెప్పి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.  మర్నాడు ఉదయం  కొన ఊపిరితో ఉన్న శివశంకర్ ను అటుగా వెళ్తున్న గ్రామస్తులు   గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సంగారెడ్డి   ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అదే రోజు చికిత్స పొందుతూ   శివశంకర్ మరణించాడు. మృతుడి  అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు   దర్యాప్తు చేపట్టారు. విచారణలో  భాగంగా  భార్య శివలీల ఫోన్    కాల్ లిస్ట్    చెక్ చేయగా హత్యకు సంబంధించిన క్లూ దొరికింది.   పోలీసు విచారణలో శివలీల  నేరం ఒప్పుకుంది. హత్య జరిగిన తీరు మొత్తం వివరించింది. శివలీల నేరం ఒప్పుకోవటంతో జహంగీర్ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరినీ రిమాండ్ కు తరలించారు.

Related Articles

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...

‘గుడ్ లక్ సఖి’ మూవీ రివ్యూ: కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?

Good Luck Sakhi Sports Drama దర్శకుడు: Nagesh Kukunoor Artist: Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapati Babu, Rahul Ramakrishna and Others సినిమా రివ్యూ:...

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...

Latest Articles

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు...

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...