Wednesday, January 26, 2022

Karthika Deepam : తాగిన మైకంలో నిజంగానే కార్తీక్ మోనితతో పడుకున్నాడా? ఆ బిడ్డ నిజంగానే కార్తీక్ బిడ్డేనా? మళ్లీ కార్తీక్, దీప మధ్య ఎడబాటు తప్పదా?

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నిజంగా బీభత్సమైన ట్విస్ట్ ను తీసుకొచ్చింది. నిన్నటి వరకు మోనిత.. ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా బిడ్డను కంటోందని అనుకున్నారు. కార్తీక్ శాంపిల్స్ తీసుకొని తన గర్భంలో ప్రవేశపెట్టుకున్నదని.. తను చీటర్ అని అంతా అనుకున్నారు. కార్తీక్ తనను ముట్టుకోలేదని.. అదంతా తన ప్లాన్ అని అందరూ నమ్మడంతో కార్తీక్ జైలు నుంచి విడుదలయ్యాడు. అందరూ కార్తీక్ ను నిర్దోషిగా.. మోనితను దోషిగా చూశారు.

deepa decision after knowing truth about mounitha in karthika deepam

కానీ… తనకు పురిటినొప్పులు ప్రారంభం కాగానే.. మోనిత ఇక ఆగలేకపోయింది. తన కడుపులో పుడుతున్న బిడ్డకు తండ్రి కార్తీకే అని సంతకం పెట్టాలని.. అలా అయితేనే ఆపరేషన్ చేయించుకుంటా అని మొండి పట్టు పట్టింది. అలాగే.. కార్తీక్ కు అసలు నిజం కూడా చెప్పేసింది. మనిద్దరం కలిస్తేనే.. నేను నీతో పడుకుంటేనే నాకు ఈ గర్భం వచ్చింది. ఇది సహజంగా వచ్చిన గర్భం. ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా వచ్చిన గర్భం కాదు.. అని మోనిత అసలు నిజం చెప్పడంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు.

Karthika Deepam : దీప పరిస్థితి ఏంటి? మళ్లీ దీప బస్తీకి వెళ్లిపోతుందా?

ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది మోనిత గురించో.. మోనితకు పుట్టిన మగ బిడ్డ గురించో లేక సౌందర్య గురించో.. కార్తీక్ గురించో కాదు.. దీప గురించి.. దీప జీవితం గురించి.. ఎందుకంటే.. మోనితను తన భార్యగా.. మోనిత కొడుకును తన కొడుకుగా కార్తీక్ అంగీకరిస్తూ సంతకం పెట్టాడు. దీంతో దీపను అడ్డంగా కార్తీక్ మోసం చేసినట్టే.ఆ విషయం ఇవాళ్టి ఎపిసోడ్ తో తెలిసిపోయింది. మోనితకు కొడుకు పుట్టాడనే విషయం దీప ప్రియమణి ద్వారా తెలుసుకుంది. ఇంటికి వచ్చాక కూడా సౌందర్య, కార్తీక్ కనీసం మోనిత విషయం ఎత్తరు. గుడికి వెళ్లి వస్తున్నామంటూ అబద్ధం చెబుతారు. దీంతో దీపకు మరింత కోపం వస్తుంది.

deepa decision after knowing truth about mounitha in karthika deepam
deepa decision after knowing truth about mounitha in karthika deepam

ఈనేపథ్యంలో దీప.. ఇక ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండకుండా.. వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే దీపకు కనీసం మోనిత విషయం కూడా సౌందర్య, కార్తీక్ చెప్పకపోవడంతో.. కార్తీక్, సౌందర్యను ఈ విషయంపై నిలదీసి.. తన పిల్లలను తీసుకొని వచ్చే ఎపిసోడ్ లో దీప తిరిగి బస్తీకి వెళ్లిపోతుందని తెలుస్తోంది.ఒకవేళ దీప బస్తీకి వెళ్లిపోతే… కార్తీక్, సౌందర్య మోనితను తమ ఇంటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తమకు వారసుడు పుట్టడంతో మోనిత కొడుకును తమ వారసుడిగా స్వీకరించే అవకాశం ఉంది. చూద్దాం మరి.. తరువాయిభాగం శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో?

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Latest Articles

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...