Wednesday, January 19, 2022

700ఏళ్ల నాటి కోట‌లో..క‌త్రినా..విక్కీ కౌశ‌ల్ ల వివాహం..నిజ‌మేనా..

బాలీవుడ్ న‌టులు క‌త్రినా కైఫ్..విక్కీ కౌశ‌ల్ పెళ్లి వార్త జోరుగా వినిపిస్తోంది. బాలీవుడ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో భాగంగా ఇప్పుడు వీరి వెడ్డింగ్‌ టైమ్‌, వెడ్డింగ్‌ వెన్యూ కూడా కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. కాగా వెన్యూ విషయం మాత్రం ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. విక్కీ కౌశల్‌, కత్రీనా కపూర్‌ ల పెళ్లి డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌లో జరగబోతుందట. ఈ ఏడాది డిసెంబర్‌లోనే వీరిద్దరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రాజస్థాన్‌లోని రత్నాంబోర్‌ నేషనల్‌ పార్క్ కి దగ్గరలోని సవై మదుపూర్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్ బర్వారాలో విక్కీ-కత్రీనా మ్యారేజ్‌ ఫిక్స్ అయ్యిందట.

చాలా గ్రాండ్‌గా, లావిష్‌గా తమ వెడ్డింగ్‌ సెర్మనీ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారని బాలీవుడ్‌ సమాచారం. తమ మ్యారేజ్‌కి సంబంధించిన దుస్తులను, డిజైనింగ్‌ వేర్‌ని కూడా ఇప్పటి నుంచే స్పెషల్‌గా రెడీ చేయిస్తున్నారట. పెళ్లి దుస్తులను ప్రముఖ డిజైనర్‌ సభ్యసాచి రూపొందిస్తున్నారని టాక్‌. తమ దుస్తులకు అవసరమైన ఫ్యాబ్రిక్స్ ఎంపిక చేసే పనిలో వీరిద్దరు ఉన్నారట‌. అయితే ఇందులో నిజమెంతా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఓ ప్రాజెక్ట్ కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని, పెళ్లి వార్తల్లో నిజం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే కత్రీనా, విక్కీ పెళ్లి చేసుకోబోతున్న వేదిక కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్ బర్వారా 14వ శతాబ్దం కాలం నాటిదని, రాజస్థాన్‌ రాయల్స్ ఫ్యామిలీ దీన్ని నేటి అవసరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారని, చాలా రాయల్‌ లుక్‌లో దీన్ని మోడ్రనైజ్‌ చేసినట్టు సమాచారం. ఈ పోర్ట్ లో రెండు టెంపుల్స్ కూడా ఉన్నాయట. 700ఏళ్ల నాటి అందాలకు ఈ కోట ప్రతిబింబంగా నిలుస్తుందని అంటున్నారు. ట్రెడిషనల్‌ సెర్మనీలకు, రాయల్‌ వెడ్డింగ్‌లకు ఇది బెస్ట్ లొకేషన్‌గా నిలుస్తుందని టాక్. ఇక్క‌డే వీరు వివాహం చేసుకోనున్న‌ట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Related Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

Latest Articles

చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే...

Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన | Chintamani Natakam

చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ...