Sunday, January 23, 2022

Online Betting : హుజూరాబాద్ ఉపఎన్నికపై వంద కోట్లకు పైగా బెట్టింగ్ | Over one hundred crore online betting on Huzurabad by-election

హుజూరాబాద్ ఉపఎన్నికపై.. జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే.. బుకీలతో పాటు సర్వే టీమ్‌లు ల్యాండైపోయాయి. హుజూరాబాద్ పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు.. వాళ్లంతా తెగ ట్రై చేస్తున్నారు.

Huzurabad by-election : హుజూరాబాద్ ఉపఎన్నికపై.. జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే.. బుకీలతో పాటు సర్వే టీమ్‌లు ల్యాండైపోయాయి. హుజూరాబాద్ పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు.. వాళ్లంతా తెగ ట్రై చేస్తున్నారు. కేవలం.. ఆన్‌లైన్‌లోనే వంద కోట్లకు పైగా బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. తెలంగాణ, ఏపీకి చెందిన వాళ్లు బెట్టింగ్‌లు కాస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏపీ నుంచి కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు హుజూరాబాద్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచే కాకుండా.. మహారాష్ట్ర నుంచి బెట్టింగ్ సర్వే టీమ్స్‌ వచ్చినట్లు సమాచారం.

ఈ మధ్యే కొందరు.. ఆంధ్ర నాయకులు, వ్యాపారులు నేరుగా హుజూరాబాద్ వచ్చి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. వీటిపై.. రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, విశాఖ, మహారాష్ట్ర, నాందేడ్, ముంబై నుంచి.. బెట్టింగ్ సర్వే టీమ్స్ వచ్చి…లెక్కలు వేసుకొని వెళ్లారు.

Huzurabad : హుజూరాబాద్‌ లో జోరుగా ప్రలోభాల పర్వం.. ఒక్కో ఓటరుకు రూ. 6 వేలు

హుజురాబాద్‌లో అప్పుడే ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు మద్యం, మాంసం పంచుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో నగదు పంపిణీ కూడా జోరుగా సాగుతుంది. ఇంటింటికి తిరిగి మరీ డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటుకు 6 వేల రూపాయల చొప్పున ఎన్వలప్‌ కవర్‌లో పెట్టి మరీ అందిస్తున్నారు.

అయితే కొంతమంది డబ్బులు రానివారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి కమలాపూర్‌ మండలంలో మహిళలు ఆందోళన చేశారు. ఆరువేల రూపాయలు కొంతమందికి మాత్రమే ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ఆరోపించారు. వారికి అనుకూలంగా ఉన్నవారికే డబ్బులు పంపిణీ చేస్తున్నారని స్థానిక మహిళలు తెలిపారు.
Election Campaign: ముగిసిన ప్రచారం పర్వం.. హుజూరాబాద్, బద్వేల్‌లో హోరాహోరీ పోటీలు

తెలంగాణలోని హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 48 గంటలే మిగిలి ఉన్నాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో గత రాత్రి 7 గంటల నుంచే మైకులతో పాటు మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. శనివారం రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులను మూసివేసి ఉంచనున్నారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...