Sunday, January 23, 2022

Badvel By-Election : బద్వేల్ ఉప ఎన్నిక.. నేటితో ప్రచారానికి తెర… | Badvel election campaign close by today evening

ఈసారి ప్రచారం ఆపే సమయాన్ని ఈసీ 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. దీంతో ఎన్నిక జరగటానికి 72 గంటల ముందే ప్రచారాన్ని అభ్యర్ధులు ఆపివేయాల్సి ఉంటుంది. అంటే ఇవాళ అక్టోబర్ 27 సాయంత్రం 5

Badvel By-Election :  2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు పోటీ చెయ్యట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం పోటీలో నిల్చున్నారు. గత రెండు రోజులుగా బద్వేల్ ఉప ఎన్నికల్లో ప్రచారం హీటెక్కింది. రూలింగ్ పార్టీ వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. వైసీపీ తరపున రెండు రోజులుగా స్టార్ క్యాంపెయిన్ గా ఎమ్మెల్యే రోజా ప్రచారం చేస్తుంది. బీజేపీ మాత్రం ప్రెస్ మీట్ లకే పరిమితమైంది. కాంగ్రెస్ కనీసం కానరావట్లేదు.

Covid : బాబోయ్.. ఒక్కరోజే 1106 కరోనా మరణాలు, దేశంలో ఇదే తొలిసారి

ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ రెండున కౌంటింగ్ జరిపి రిజల్ట్ తెలపనున్నారు. ఇప్పటికే బద్వేల్ ఉప ఎన్నిక కోసం 272 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 30 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించారు. 50శాతం పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, లైవ్ వెబ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈసారి ప్రచారం ఆపే సమయాన్ని ఈసీ 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. దీంతో ఎన్నిక జరగటానికి 72 గంటల ముందే ప్రచారాన్ని అభ్యర్ధులు ఆపివేయాల్సి ఉంటుంది. అంటే ఇవాళ అక్టోబర్ 27 సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెర పడుతుంది.

Balakrishna : మోహన్ బాబుతో మొదలు పెట్టనున్న బాలకృష్ణ

ఒక్కరోజే ప్రచారానికి సమయం ఉండటంతో ప్రచార హోరు మిన్నంటింది. నేడు బద్వేలులో వైసిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేసి వైసీపీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. బీజేపీ మాత్రం ప్రచారం అంతంతమాత్రంగా చేస్తుంది. ఇక కాంగ్రెస్ అసలు పోటీలో ఉందా లేదా అన్నట్టు వ్యవహరిస్తోంది. మరి ఈ ఉప ఎన్నికల్లో రిజల్ట్ ఒక వైపే ఉంటుందా లేక పోటీ ఎదురవుతుందా వైసీపీకి చూడాలి మరి.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...