Friday, January 28, 2022

Karthika Deepam : కార్తీక దీపం క్లైమాక్స్ మాములుగా లేదుగా.. ‘వంటలక్క’ గురించి తెలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కన్నీటి వర్షమే! | The Telugu News

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్లో ‘దీప అలియాస్ వంటలక్క’ అనే పేరు వింటే చాలు బుల్లితెర అభిమానులకు ఏదో తెలియని ఎమోషన్. కార్తీక దీపం సీరియల్ చూసేందుకు ప్రతీ ఇంట్లో సాయంత్రం 7.30 ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తుంటారు మహిళలు. ఈ టైంలో పిల్లలు ఎదైనా చానెల్ కోసం గొడవ పెట్టారంటే అంతే ఇక.. యుద్దాలు జరుగచ్చు. లేదా పిల్లల వీపులు కూడా పగులొచ్చు. అంతటి క్రేజ్ కార్తీక దీపం సొంతం.ఈ సీరియల్ టీఆర్పీల విషయంలోనూ అన్ని సీరియన్లను వెనక్కి నెట్టేసింది. వంటలక్క అనే ఒక్క పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బుల్తితెర ప్రేక్షలకులను ఎంతాల కట్టి పడేసిందంటే మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఇంట్లో ఎన్ని పనులున్నా సాయంత్రం 7 గంటలోపు పూర్తి చేసుకుని మహిళలు టీవి ముందు కూర్చున్నారంటే అతిశయోక్తి కాదు.

karthika deepam climax is not as usual

ఇప్పటికే కార్తీకదీపం సీరియల్ 1050 ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకుని దూసుకుపోతుంది. 2017లో ప్రారంభమైన కార్తీక దీపం సీరియల్ చాలా మలుపులు తిరుగుతూ 2021లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, సీరియల్ ముగింపు దశకు వచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఇదంతా ఉత్తముచ్చటే అని, ఇంకా వన్ ఇయర్ వరకు ఈ సీరియల్ నడుస్తుందని టాక్.కాగా, కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ ముందుగానే లీక్ అయ్యింది. మలయాళంలో ఇప్పటికే ఈ సీరియల్ అయిపోయింది కూడా. ఈ క్రమంలోనే మళయాళం క్లైమాక్స్‌ను కూడా ఇక్కడ రీషూట్ చేస్తారని టాక్. అయితే, సీరియల్ ముగింపులో తనకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని తెలిసుకుని.. తన భార్యకు సారీ చెప్పడానికి వెళ్తాడు డాక్టర్ బాబు.

Karthika Deepam : క్లైమాక్స్ నిజంగానే దగ్గర పడిందా..

karthika deepam climax is not as usual
karthika deepam climax is not as usual

ఇప్పటికే తెలుగు సీరియల్‌లో మోనిత మోసం గురించి తెలిసిన కార్తీక్ తన భార్య దీపను దగ్గరికి తీసుకున్నాడు. ఆమెను మరోసారి దూరం చేసుకోవద్దని ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా ట్విస్టుల తర్వాత.. డాక్టర్ బాబు దీపను కలుసుకునే సమయానికి వంటలక్క చనిపోతుందట.. అది తెలిసి డాక్టర్ బాబు గుండెలు పలిగేలా ఏడుస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో విలన్ అయిన మోనిత తనకు కార్తీక్ దక్కలేదనే ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా, తెలుగులో ఈ సీరియల్‌కు ఇప్పట్లో క్లైమాక్స్ రాదని అంతా భావిస్తున్నారు. ఒకవేళ మళయాలం క్లైమాక్స్ తెలుగులో పెడితే నిజంగానే వంటలక్క చనిపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కన్నీటి వర్షం జలదారలా పారుతుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

Related Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...