Sunday, January 23, 2022

Telangana : వ్యాక్సిన్‌‌కు పెన్షన్, రేషన్ లింక్..డీహెచ్ వ్యాఖ్యలపై గందరగోళం! | No Vaccination ..? No Ration And Pension DH Srinivas


No Vaccination ? No Ration : తెలంగాణలో వ్యాక్సిన్‌ విషయంలో డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్ శ్రీనివాసరావు చేసిన ఓ ప్రకటన.. తీవ్ర గందరగోళాన్ని రేపింది. వ్యాక్సిన్ తీసుకోకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారిన వారి రేషన్‌, పెన్షన్ కట్‌ చేస్తామంటూ డీహెచ్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు.. నవంబర్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందంటూ డేట్‌ కూడా చెప్పేశారు. తెలంగాణలో అందరూ వ్యాక్సిన్‌ తీసుకునేందుకే ఈ చర్యలన్నారు శ్రీనివాసరావు.. పెన్షన్‌, రేషన్‌కు.. వ్యాక్సిన్‌కు లింకేంటంటూ ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలోనే పౌరసరఫరాల శాఖ మరో ప్రకటన చేసింది.

Read More : Coiveshield Vaccine: Serum application for Coiveshield sales in the open market

డీహెచ్‌ వ్యాఖ్యలపై సివిల్ సప్లయ్‌ శాఖ అధికారులు మాత్రం భిన్నంగా స్పందించారు.. వ్యాక్సినేషన్‌తో తమకు సంబంధం లేదని.. రేషన్ ఆపాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. అటు సెర్ప్‌ అధికారులు ఈ విధంగానే స్పందించారు. వ్యాక్సినేషన్‌తో పెన్షన్‌కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. దీంతో డీహెచ్‌ శ్రీనివాస్‌ రావు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయమా, శాఖా పరంగా తీసుకున్న నిర్ణయమా, లేక స్వయంగా వన్‌ సైడెడ్‌గా చేసిన అనౌన్స్‌మెంటా అనే దానిపై గందరగోళం నెలకొంది.. ఇప్పుడు ఎవరి వ్యాఖ్యలు అధికారికంగా వచ్చాయో అని తెలంగాణ ప్రజల్లో డైలమా నెలకొంది.

Read More : Corona New Variant: A4 new type of corona in Madhya Pradesh ఆ six infected with the virus after taking two doses of the vaccine‌

మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల ఒక లక్షా 92 వేలకు పైగా డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైంది.. ఇందులో ఫస్ట్‌ డోస్‌ పూర్తి చేసుకున్నవారు 2 కోట్ల 14 లక్షల 6 వేల మందికి పైగా ఉండగా.. రెండు డోసులు తీసుకున్న వారు 87 లక్షల 86 వేలకు పైగా ఉన్నారు.. మేడ్చల్, నల్లగొండ జిల్లాలోని నర్సింగ్ స్టాఫ్‌ వ్యాక్సిన్ తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వ్యాక్సిన్‌పై అవగాహాన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల్లో కూడా చాలా మంది ఇప్పటి కూడా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి తటపటాయిస్తున్నారు.. ఇప్పటికే ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది సర్కార్‌.. ఈ కఠిన నిర్ణయాల్లో భాగంగానే నవంబర్‌ ఒకటి నుంచి వ్యాక్సిన్‌ తీసుకొని వారికి రేషన్, పెన్షన్ కట్‌ చేస్తామని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు.. అయితే రేషన్ కట్‌ చేయడానికి వ్యాక్సినేషన్‌కు సంబంధమేంటన్నది మాత్రం అంతుబట్టడం లేదు.

The post Telangana : వ్యాక్సిన్‌‌కు పెన్షన్, రేషన్ లింక్..డీహెచ్ వ్యాఖ్యలపై గందరగోళం! appeared first on 10TV.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...