Sunday, January 23, 2022

Lovers Suicide Attempt : ప్రేమజంట ఆత్మహత్య…ప్రియురాలు మృతి..ప్రియుడు సేఫ్ ? | Lovers Suicide Attempt


ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించలేదని పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అనూహ్యంగా యువతి మృతి చెందింది. సినిమా స్టోరిని తలపించే ఘటన హైదరాబాద్‌ చందానగర్‌లో జరిగ

Lovers Suicide Attempt :  ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించలేదని పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అనూహ్యంగా యువతి మృతి చెందింది. సినిమా స్టోరిని తలపించే ఘటన హైదరాబాద్‌ చందానగర్‌లో జరిగింది.

గుంటూరు జిల్లా రెంట్యాలకు చెందిన కోటిరెడ్డి మెడికల్ రిప్రెజెంటెటివ్‌గా పనిచేశాడు. ఈక్రమంలో అతనికి రెండేళ్ల క్రితం ఒంగోలులోని ఏడుగుండ్లపాడులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నాగ చైతన్య అనే యువతి పరిచయం అయ్యిందియ. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది.

కొన్నాళ్లకు ఆ యువతి హైదరాబాద్‌ వచ్చి చందానగర్‌లోని ఓ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. పెళ్లి విషయమై ఇటీవల ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావటంతో ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పాడు కోటిరెడ్డి. దీంతో ప్రేమ పెళ్లికి సిద్ధమయ్యారు.

ప్రియుడు కోటిరెడ్డి ఈనెల 23 న హైదరాబాద్‌ వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంటికి కావాల్సిన సామానంతా కొనుగోలు చేశారు. ఆ తర్వాత చందానగర్ లోని ఓ లాడ్జ్‌లో దిగారు.  అక్కడ ఏం జరిగిందో ఏమో అమ్మాయి మృతి చెందింది.  కోటిరెడ్డికి గాయాలు అయ్యాయి. దీంతో లాడ్జ్‌ నుంచి కోటిరెడ్డి ఒంగోలు వెళ్లిపోయి…. అక్కడ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

రెండు రోజులైనా రూమ్ నుంచి ఎవరూ బయటకు రాకపోవటంతో లాడ్జి సిబ్బంది మారు తాళాలతో   తీసి చూడగా యువతి హత్యకు గురై పడి ఉంది. పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. లాడ్జి బుక్ లో ఇచ్చిన వివరాల ఆధారంగా కోటి రెడ్డి ఒంగోలులో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఒంగోలు వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని అదుపులోకి తీసుకుని చికిత్సఅందిస్తున్నారు.

అయితే యువతి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తామిద్దరం ప్రేమించుకున్నామని తమ పెళ్లికి ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని  అందుకే ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు కోటిరెడ్డి పోలీసులకు చెప్పాడు. ప్రేమ పెళ్లిచేసుకునేందుకు హైదరాబాద్ వచ్చానని ఇంటికి కావాల్సిన సామానంతా కొనుగోలు చేసి హోటల్ లో రూం తీసుకున్నామన్నాడు.

అక్కడ మళ్లీ పెళ్లి విషయమై మాట్లాడుకున్నామని ఇంట్లో పెద్దవాళ్లుఒప్పుకోవట్లేదని  చెప్పగా నాగచైతన్య    ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లి కొత్తగా కొనుగోలు చేసిన కత్తి తీసుకని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.  అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించానని కత్తితో పొడుచుకోగా గాయాలయ్యాయని…. మర్నాడు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని… అప్పుడు ఉరి తాడు జారిపోవటంతో ఇంక ఒంగోలు వచ్చేసానని చెప్పుకొచ్చాడు.

Also Read : Cyber Crime : రూపాయితో రీఛార్జి అన్నాడు..రూ.11 లక్షలు కాజేశాడు

కోటి రెడ్డే నాగచైతన్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు అనుమానం రావటంతో కోటి రెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకని చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. నాగ చైతన్య పొడుచుకుంటే మరణించగా ….మరి అదే ప్రయత్నం చేసిన కోటి రెడ్డి ఎందుకు మరణించలేదు…. కాగా తీవ్ర గాయాల పాలైన కోటి రెడ్డి ఒంగోలు ఎలా వచ్చాడు. అతనే స్వయంగా వచ్చాడా లేక  వేరే ఎవరైనా తీసుకువచ్చి ఒంగోలు ఆస్పత్రిలో చేర్పించారా అనే విషయాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. చందా నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...