Wednesday, January 19, 2022

Boy Murder : లైంగిక దాడి చేసి.. చిత్తూరులో బాలుడి హత్య కేసులో షాకింగ్ నిజాలు | Shocking Truths In Chittoor District 8 Year Old Boy Murder Case


చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడు తేజష్ రెడ్డి హత్య కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఓ ఉన్మాది బాలుడిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడని

Boy Murder : చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడు తేజష్ రెడ్డి హత్య కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఓ ఉన్మాది బాలుడిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడని తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. నందకుమార్‌ అనే వ్యక్తి బాలుడిపై లైంగిక దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు గుర్తించారు.

Hair Dye : జుట్టుకు హెయిర్ డై వాడుతున్నారా!..తప్పక తెలుసుకోవాల్సిందే…

చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం ఎగువ మేకలవారి పల్లిలో ఈ నెల 12న ఓ బాలుడు దారుణ హత్యకు గుయ్యాడు. ఆస్తి గొడవల వల్ల ఈ హత్య జరిగి ఉండొచ్చని, దగ్గరి బంధవులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని తొలుత పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో విచారించారు. అయితే, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు మరో కోణంలో లోతుగా విచారించారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో గ్రామానికి చెందిన నంద కుమార్‌ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటకు కక్కాడు నందకుమార్.

తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన బాలుడిపై నందకుమార్ లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతాడనే భయంతోనే బాలుడిని నంద కుమార్ హత్య చేసి బొప్పాయి తోటలో పడేశాడని పోలీసులు తెలిపారు. నందకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కాగి, నిందితుడు హోమో సెక్సువల్ అని భావిస్తున్నారు. బాలుడిపై నందకుమార్ లైంగిక దాడి చేసి హత్య చేశాడని తెలియడంతో గ్రామస్తులు షాక్ కి గురయ్యారు.

Smart Phone : రాత్రి నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా…అయితే జాగ్రత్త!..

బాలుడి తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి కోసం కువైట్ కి వెళ్లారు. అప్పటి నుండి బాలుడు పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ స్కూల్ కి వెళుతున్నాడు. మూడో తరగతి చదువుతున్న బాలుడు.. దసరా సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ బయట ఆడుకుంటున్న క్రమంలో అదృశ్యమయ్యాడు. చుట్టుపక్కల వెతికినా బాలుడు కనిపించకపోయేసరికి ఆందోళన చెందిన బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో అక్టోబర్ 13న బొప్పాయి తోటలో బాలుడి మృతదేహం కనిపించింది.

బాలుడి గొంతు నులిమి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దగ్గరి బంధువులే బాలుడిని హతమార్చి ఉంటారని భావిస్తున్న క్రమంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై ఈ దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. తల్లిదండ్రులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలోనూ విచారించారు. అంతేకాదు కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా అని ఆరా తీశారు. కానీ, వీటికి మించిన షాకింగ్ నిజం వెలుగుచూసింది.

Related Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

Latest Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే...

Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన | Chintamani Natakam

చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ...