Friday, January 21, 2022

CM KCR : టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక | CM KCR was unanimously elected as the TRS president Once again

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్లీనరీలో కేసీఆర్ ఎన్నికను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే.కేశవరావు ఎన్నికను ప్రకటించారు.

TRS president CM KCR : టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే.కేశవరావు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.

పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ మొత్తం 18 సెట్ల నామి‌నే‌షన్లు దాఖ‌లైన విష‌యం తెలిసిందే. పార్టీ‌లోని అన్ని విభా‌గాలు, అన్ని సామా‌జి‌క‌వ‌ర్గాల నేతలు కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ నామి‌నే‌షన్లు దాఖ‌లు‌ చే‌శారు. అధ్యక్ష పద‌వికి ఇత‌రు‌లె‌వ్వరూ నామి‌నే‌షన్లు దాఖ‌లు చే‌య‌క‌పో‌వ‌డంతో కేసీ‌ఆర్‌ ఎన్నిక ప్రక‌టన ఏక‌గ్రీవ‌మైంది.

TRS plenary : కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వివిధ డిమాండ్లు

పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ ఇప్ప‌టి‌వ‌రకు వరు‌సగా ఎని‌మి‌ది‌సార్లు ఏక‌గ్రీ‌వంగా ఎన్ని‌క‌య్యారు. పార్టీ ఆవి‌ర్భావం తర్వాత ఇది 9వ సంస్థా‌గత ఎన్నిక. చివ‌రి‌సా‌రిగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరి‌గింది. 2019లో పార్ల‌మెంట్‌ ఎన్ని‌కలు, 2020, 2021లో కరోనా కార‌ణంగా పార్టీ ప్లీనరీ నిర్వ‌హిం‌చ‌లేదు.

టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. మొదటగా కేసీఆర్ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ప్లీనరీ సమావేశంలో మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు.

Badvel By-Election : బద్వేల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు సీపీఐ మద్దతు

మొదటి సెషన్ లో మూడు తీర్మానాలు, మధ్యాహ్నం సెషన్ లో నాలుగు తీర్మానాలను ఆమోదించనున్నారు. మూడేళ్ల తర్వాత జరుగుతున్న పార్టీ పండగ కోసం ధూంధాంగా ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ కోసం ప్రత్యేకంగా సాంగ్‌ను కూడా రూపొందించారు. వేలాది ఫొటోలతో సీఎం కేసీఆర్‌ లైఫ్‌ హిస్టరీని ప్రదర్శించారు.

Related Articles

Ravi Teja Mother : రవితేజ తల్లిపై కేసు నమోదు

ప్రధానాంశాలు:సినిమాలతో రవితేజ బిజీవార్తల్లో రవితేజ తల్లిఅక్రమంగా నిర్మాణపై కేసుసినిమాలతో తప్పా వ్యక్తిగత విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన ఫ్యామిలీ కూడా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించదు. ఆ మధ్య...

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

Latest Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...