Friday, January 21, 2022

Mumbia: ట్రాఫిక్ సిగ్న‌ల్ ద‌గ్గ‌ర పూరి అభిమాని.. చార్మి ఏం చేసిందో తెలుసా..

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ గా పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌కంటే ఓ స్పెష‌ల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అత‌ను ఎలాంటి సినిమా చేసినా.. హీరోల డైలాగ్స్‌లో ఓ స్పెషాలిటీ ఉంటుంది. ప్రేక్ష‌కులు ఫిదా అవుతారు.

దాదాపు పూరి ఏ హీరోతో వర్క్ చేసినా కూడా ఆ హీరో అభిమానులు అతనికి కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు. పూరి జగన్నాథ్ డైలాగ్స్ అంటే నేటి తరం యువతకు ఒక పిచ్చి అనే చెప్పాలి. ఎక్కడ కనిపించినా కూడా ఫోటోలు తీసుకోవడానికి ఎగబడుతుంటారు. రీసెంట్ గా ఒక ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పూరి ఒక తెలుగు కుర్రాడిని కలిసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ముంబైలో తెలుగు కుర్రాడు
ఇటీవల హఠాత్తుగా ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తెలుగు కుర్రాడు కనిపించడంతో పూరిజగన్నాథ్ చాలా సింపుల్ గా మాట్లాడాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ సినిమా కోసం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా ముంబైలోనే జరుగుతోంది. ఇక షూటింగ్ లొకేషన్ దగ్గరకు హోటల్ నుంచి కారులో వెళ్తున్న పూరి జగన్నాథ్ కు అనుకోకుండా ఒక తెలుగు కుర్రాడు కనిపించాడు.

కారు నెంబర్ చూసి..
కారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు ఆ కుర్రాడు వెనకాల బండి నెంబరు చూసి టిఎస్ అని ఉంది.. అంటే తప్పకుండా తెలుగు వారు అయి ఉంటారు అని అనుకున్నాడట. కారులోకి చూడడంతో పూరి జగన్నాథ్ కనిపించాడు. దీంతో వెంటనే అతన్ని కలుసుకునేందుకు ప్రయత్నం చేయగా పూరి జగన్నాథ్ కూడా కారు అద్దాలు తీసి అతనితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు.

సెల్ఫీ తీసుకోవడానికి మొబైల్ లేదు..
టిఎస్ అని కారు నెంబర్ ఉండడంతో మన తెలుగు వాళ్లే అయ్యి ఉంటారు అనుకున్నాను.. కానీ పూరి గారు కనిపించారు. అంటూ ఆ కుర్రాడు ఎంతగానో సంబుర‌ప‌డ్డాడు. అంతేకాకుండా ప్రస్తుతం తన దగ్గర మొబైల్ లేదని లేకుంటే ఫోటో తీసుకునే వాడినని దీనంగా చెప్పాడు. ఇక అతని మాటలు మాట్లాడే విధానాన్ని చూసి పూరి జగన్నాథ్ కూడా ఎంతగానో సంతోషించాడు. పేరు ఏమిటి అని అడగగా అతను ప్రమోద్ అని చెప్పాడు. దీన్నంతా వీడియో తీసిని చార్మి.. ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...