Sunday, January 23, 2022

Chandrababu Naidu Delhi Tour : ఏపీ పాలిట్రిక్స్ – చంద్రబాబు టీం ఢిల్లీ టూర్ | Chandrababu Naidu Delhi Tour

ఏపీ పాలిటిక్స్… హస్తినలో   సెగలు రేపబోతోంది.   నిన్నటి దాకా మాటల మంటలు, దీక్షలతో ఓ రేంజ్‌ లో పొలిటికల్ హీట్‌ సృష్టించిన టీడీపీ, వైసీపీ.. ఇక ఢిల్లీ వేదికగా తేల్చుకునేందుకు సిద్ధమయ

Chandrababu Naidu Delhi Tour :  ఏపీ పాలిటిక్స్… హస్తినలో   సెగలు రేపబోతోంది.   నిన్నటి దాకా మాటల మంటలు, దీక్షలతో ఓ రేంజ్‌ లో పొలిటికల్ హీట్‌ సృష్టించిన టీడీపీ, వైసీపీ.. ఇక ఢిల్లీ వేదికగా తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలో.. టీడీపీ నాయకులు కేంద్రం పెద్దలను కలిసేందుకు రెడీ అయ్యారు. మరోవైపు.. వైసీపీ నేతలు ఈసీని కలిసి తెలుగుదేశం గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు.

ఏపీ రాజకీయం ఢిల్లీ బాటపట్టనుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై.. చంద్రబాబు ఢిల్లీలో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అండ్ టీమ్‌కు ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా ఖరారైంది. ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కలవనున్నారు చంద్రబాబు. ఆయనతో పాటు మరో ఐదుగురు టీడీపీ నాయకులకు.. రాష్ట్రపతి కార్యాలయం అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు టీడీపీ నేతలు. మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : Etala Rajender : కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో నన్ను బయటకు పంపారు : ఈటల

ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అజెండాపై చర్చించారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కూడా కోరడంతో… సోమ, మంగళవారాల్లో చంద్రబాబు అండ్ టీమ్ ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. చంద్రబాబుతో పాటు పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు, మరో 14 మంది ముఖ్యనేతలు కలిసి మొత్తం 18 మంది రెండు రోజుల ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటన వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలు ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు అప్పగించారు. ఎన్టీఆర్ భవన్ పై దాడికి సంబంధించి సీబీఐ విచారణ జరపాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కోరటంతో పాటు అవసరమైతే న్యాయవ్యవస్థ తలుపు తడతామని పయ్యావుల కేశవ్ తెలిపారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోన్న టీడీపీకి… వాళ్లిద్దరూ అపాయింట్‌మెంట్ ఇస్తారా.. లేదా.. అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు.. వైసీపీ నాయకులు కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరనున్నారు. రెండు పార్టీల నాయకులు.. ఢిల్లీ టూర్లకు సిద్ధమవడంతో.. ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఢిల్లీ వేదికగా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది.. మరింత ఆసక్తిగా మారింది.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...