Friday, January 21, 2022

Thirumala : తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల | Thirumala Srivari Sarvadarshanam tokens released


కరోనా టైమ్‌లో శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.. నిన్న స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

Srivari Sarvadarshanam tokens : కరోనా టైమ్‌లో శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.. నిన్న స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.. కొద్ది సేపటి క్రితమే తిరుమల శ్రీవారి సర్వ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచింది టీటీడీ. నవంబర్‌కు నెలలకు సంబంధించిన టోకెన్లు వెబ్‌సైట్‌లో ఉంచింది. రోజుకు పదివేల చొప్పున.. 3 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఉచిత దర్శనం టికెట్లు సైతం హాట్‌కేక్‌ల్లా బుక్‌ చేసుకుంటున్నారు భక్తులు. వెబ్‌సైట్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంచిన కొద్ది సేపటికే.. బుకింగ్స్ పూర్తైపోతున్నాయి. ఇక ఈనెల 25న తిరుమలలో వసతి గదుల రిజర్వేషన్‌ నవంబర్‌ నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అటు నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు వేగంగా అమ్ముడుపోయాయి. 300 రూపాయల ధర. 7లక్షల 08వేల టిక్కెట్లు. కేవలం మూడు గంటల్లోనే శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు అమ్ముడుపోయాయి. శ్రీవారి దర్శనానికి ఎంత క్రేజ్‌ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడు లక్షలకుపైగా దర్శన టికెట్లు…. హాట్‌ కేక్‌ల్లా అమ్ముడుపోయాయి. కేవలం మూడు గంటల్లోనే బుక్‌ చేసుకున్నారు భక్తులు. ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల చేసిన అరగంటలోనే సగానికి పైగా బుక్‌ అయ్యాయి. మిగిలినవి మరో రెండున్నర గంటల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో శ్రీనివాసుడు దర్శనానికి ఫుల్‌ డిమాండ్‌ ఉందన్నది మరోసారి నిరూపితమైంది.

Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం

నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను నిన్న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో పెట్టింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి 7 లక్షల 8వేల టికెట్లను వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచింది. ఇలా టీటీడీ పెట్టిందో లేదో.. అలా అమ్ముడుపోయాయి. శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లన్నీ బుక్‌ చేసుకున్నారు భక్తులు. ఈ టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి 21 కోట్ల 24 లక్షల ఆదాయం సమకూరింది.

వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను ఈనెల వరకు రోజుకు 8వేల చొప్పున విక్రయించింది. నవంబర్‌ నుంచి వీటి కోటాను 12వేలకు పెంచింది. రోజువారీ కోటాను 12వేలకు పెంచి మరీ ఆన్‌లైన్‌లో ఉంచింది టీటీడీ. టికెట్లన్నీ అమ్ముడు పోతాయా లేదా సందేహం కాస్తా టీటీడీ అధికారుల్లో ఉండేది. కానీ భక్తులు టికెట్లన్నీ మూడు గంటల్లోనే బుక్‌ చేసుకుని అందరికీ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు.

Thirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటే చాలు… తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి మరీ ఏడుకొండలవాడి దర్శనానికి వస్తుంటారు. అయితే తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుని దర్శనానికి పలు మార్గాలు ఉన్నాయి. సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్‌ దర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు.

ఒకప్పుడు తిరుమలకు వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు టికెట్లు జారీ చేసిన టీటీడీ.. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన టికెట్ల జారీ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది. 60 రోజుల ముందుగా రిజర్వ్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌, అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ద్వారా సేవా టికెట్లను విక్రయిస్తోంది. ఇందులో భాగంగానే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...