Friday, January 28, 2022

Tirupati Tragedy : వర్షపు నీటిలో మునిగి నవవధువు మృతి | Tirupati Tragedy

తిరుపతిలో నిన్న రాత్రి  విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసినఘటన తిరుపతిలో వెలుగు చూసింది.

Tirupati Tragedy : తిరుపతిలో నిన్న రాత్రి  విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షాలతో నగరంలో పలు లోతట్టుప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసినఘటన తిరుపతిలో వెలుగు చూసింది.

కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన కుటుంబ సభ్యులు పెళ్లి అయిన తర్వాత నూతన వధూవరులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి తుపాన్ వాహనంలో బయలు దేరి తిరుపతి వచ్చారు. వారు తిరుపతి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురిసి పలు లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. ఈ క్రమంలో వారు వస్తున్న వాహనం తిరుపతి బాలాజీ కాలనీ నుండి యం.ఆర్.పల్లి కి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి(వెస్ట్ చర్చ్) వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ లో ఇరుక్కుపోయింది.

Tirupati Tragedy 1

అక్కడ అప్పటికే 8 అడుగుల ఎత్తులో నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో లోతు తెలియని డ్రైవర్ సురక్షితంగా వెళ్లిపోవచ్చనే ధీమాతో వాహనాన్ని వేగంగా నీళ్లలోకి పోనిచ్చాడు. ఎంత వేగంగా పోనిచ్చినా ఇంజన్ లోకి నీరు చేరటంతో తుపాను వాహనం నీటిమధ్యలో చిక్కుకు పోయింది. కొద్ది సేపటిలోనే తుపాను వాహనం నీటిలో మునిగిపోయింది.

Tirupati Tragedy 2

Tirupati Tragedy 2

సమాచారం తెలుసుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి వాహనంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈలోగా వాహనంలో ప్రయాణిస్తున్న నవవధువు సంధ్య అక్కడికక్కడే నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tirupati Tragedy 3

Tirupati Tragedy 3

కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్.శిరీష ఈరోజు ఉదయం పరిశీలించారు. ఈ అండర్ బ్రిడ్జివద్ద నీళ్లు నిలిచిపోవటం చాలాకాలంగా జరుగుతోందని…. వాహనం నీట మునిగి నవ వధువు మరణించటం దురదృష్టకరం అని భూమన అన్నారు. ఈ మార్గంలో రోడ్డు ఎత్తు పెంచటం..నీళ్లు బయటకు వెళ్లేలా మార్గాలు ఏర్పాటు చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడి త్వరితగతిన సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Related Articles

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Latest Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...