Sunday, January 23, 2022

Vallabhaneni Vamsi : పరిటాల సునీతను ఇప్పటికీ అలానే చూస్తా.. వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు | The Telugu News

Vallabhaneni Vamsi : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు రోజురోజుకూ పెరుగుతుండగా, తాజాగా టీడీపీ రెబల్ నేత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి పరిటాల సునీత మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. పరిటాల సునీత వ్యాఖ్యలకుగాను వంశీ తాజాగా కౌంటర్ ఇచ్చారు.‘ఏపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట నిర్వహించిన నిరసన దీక్షలో మాజీ మంత్రి పరిటాల సునీత ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయ్యాక ఒక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామన్నారు.

vallabhaneni vamsi comments on parital sunitha

తన భర్తను చంపినప్పుడు ఓర్పుగా ఉండాలని చంద్రబాబు సూచించారని గుర్తు చేశారు. మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సారి ఎన్నికల్లో వల్లభనేని వంశీ, కోడాలి నాని ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. టీడీపీలో వారికి అవకాశం ఇవ్వడం వల్లే ఈ రోజు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారన్న సంగతి గుర్తెరగాలని సూచించారు. తాము వైసీపీ నేతల కంటే ఎక్కువగా మాట్లాడగలమని, కానీ, తమను అలా మాట్లాడొద్దని చంద్రబాబు వారిస్తున్నారని, అందుచేత తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్పుగా ఉంటున్నారని చెప్పారు. ఇకపోతే పరిటాల సునీత వ్యాఖ్యలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేదని, ఇప్పుడే రాజీనామా చేస్తానని అన్నారు.

Vallabhaneni Vamsi : చంద్రబాబుపై ఫైర్ అయిన వంశీ..

tdp
tdp

ఈ మేరకు వంశీ తన లెటర్ హెడ్‌పై సంతకం చేసి ఇవ్వడంతో పాటు తాను రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు పంపాలని పరిటాల సునీతకు సూచించారు. తాను ఇప్పటికీ పరిటాల సునీతను వదినగానే చూస్తానని అన్నారు.అయితే, చంద్రబాబు నాయుడు తల్లికి, గర్భస్థ శిశువు గొడవ పెట్టగలిగేంత వ్యక్తని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టును పరిటాల సునీత చదివి ఉంటారని ఆరోపించారు. ఇకపోతే గన్నవరం లేదా గుడివాడకు తాను లేదా కోడాలి నాని మొదలు, చివర కాదని చెప్పారు. దమ్ముంటే టీడీపీ నేత నారా లోకేశ్‌ను గన్నవరంలోనో లేదా గుడివాడలోనో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

Related Articles

Bangarraju : బ్ర‌హ్మానందంను తీసుకుంటే వ‌చ్చే స‌మ‌స్య అదే.. అందుకే ‘బంగార్రాజు’లో తీసుకోలేదు : అక్కినేని నాగార్జున‌

ప్రధానాంశాలు:‘బంగార్రాజు’లో బ్రహ్మానందం క్యారెక్టర్ గురించి నాగ్ వివరణబ్రహ్మానందం క్యారెక్టర్‌లో అదే సమస్య‘బంగార్రాజు’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న నాగార్జున, చైతుటాలీవుడ్ కామెడీ కింగ్ అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు బ్ర‌హ్మానందం. ఒకానొక...

రోజు రోజుకు మారుతున్న యూపీ ఎన్నికల ముఖచిత్రం.. అఖిలేష్ యాదవ్ పార్టీలోకి దేశంలో అత్యంత ఎత్తైన వ్యక్తి..

దేశంలో అత్యంత ఎత్తైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు (Dharmendra Pratap Singh). యూపీ విధానసభ...

అది దాచినా దాగదు : శ్రుతి హాసన్

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రుతి హాసన్‌కు మొదటి విజయాన్ని అందించింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. ఆమెను నెత్తిన పెట్టుకుంది కూడా...

Latest Articles

ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో. ప్రభాస్ చేసే సినిమాల మీద అంతర్జాతీయ స్థాయి నటీనటుల కన్ను ఉంటుంది. ప్రభాస్ సినిమాలన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంటాయి. అలాంటి ప్రభాస్ ...

Ramesh Babu : ర‌మేష్ బాబు పెద‌క‌ర్మ‌కు హాజ‌రైన మ‌హేష్‌..వైర‌ల్ అవుతున్న ఫొటో!

ప్రధానాంశాలు:రమేష్ బాబు పెద కర్మకు హాజరైన మహేష్కోవిడ్ నుంచి కోలుకున్న మహేష్నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో ర‌మేష్ బాబు మ‌ర‌ణం అనేది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది....