Friday, January 28, 2022

MP Raghurama : వైఎస్ జగన్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన రఘురామ | MP Raghurama Files Another Petition On Jagan In Supremecourt

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ ను వదలడం లేదు. జగన్ పై ఆయన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ..

MP Raghurama : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ ను వదలడం లేదు. జగన్ పై ఆయన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు. ఈ కేసుల విచారణ త్వరగా జరిగితే జగన్ కూడా కడిగిన ముత్యంలా బయటపడతాడు కదా అని రఘురామ అన్నారు. మా ముఖ్యమంత్రి నిర్దోషిగా బయటకు రావాలని రఘురామ అన్నారు.

చార్జిషీట్లు నమోదైన కేసుల్లో ఏడాదిలోగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని రఘురామ గుర్తు చేశారు. జగన్ కేసుల విచారణ త్వరగా పూర్తయితే ఇక ఆయనను ఎవరూ వేలెత్తి చూపేందుకు వీలుండదని అన్నారు. కింది కోర్టుల్లో కొట్టేసినట్టు తన పిటిషన్ ను సుప్రీంకోర్టులో కొట్టివేయరని భావిస్తున్నట్టు తెలిపారు. జగన్ పై దాఖలైన ఛార్జిషీట్లపై విచారణ 2200 సార్లకు పైగా వాయిదా పడినట్లు రఘురామ వెల్లడించారు.

Sextortion Racket : స్ట్రిప్‌చాట్ పేరుతో 200 మందిని రూ.22 కోట్లు మోసం చేసిన ముఠా గుట్టురట్టు

అయితే తాను గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లతో తాజా పిటిషన్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అప్పట్లో కూడా తాను జగన్ బెయిల్ రద్దయి విచారణ వేగంగా జరిగితే ఆయన నీలాపనిందలు లేకుండా బయటపడతాడన్న ఉద్దేశంతోనే బెయిల్ రద్దు పిటిషన్ వేశానని వివరించారు.

గతంలో జగన్ బెయిలు రద్దు చేయాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్ వేయగా కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును ఆయన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయగా సాంకేతిక కారణాలతో వెనక్కి పంపింది. అయితే ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించేలా సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై రఘురామ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక, మద్యం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు, మంత్రుల భాష, మూడు రాజధానులు.. ఇలా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు తమ పార్టీ గుర్తుపై గెలిచి తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణం రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు...

Latest Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...