Wednesday, January 19, 2022

Pawan Kalyan: పవన్ కల్యాణ్ తొందరపడుతున్నారట.. కారణం ఇదేనట..! | Pawan Kalyan serious mode on movies

పవన్ కల్యాణ్ తొందరపడుతున్నారు. ఇప్పటికే 3 సినిమాలను లైన్లో పెట్టిన పవర్ స్టార్ మరో 2 సినిమాలు కూడా కమిట్ అయినట్టు తెలుస్తోంది. కానీ ఆయన…!

సినిమాల్లో పవర్ స్టార్ గా.. రాజకీయాల్లో జనసేనానిగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్ కల్యాణ్.. తొందర పడుతున్నారట. సాగర్ దర్శకత్వంలో చేస్తున్న భీమ్లానాయక్ సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చి.. జెట్ స్పీడ్ లో షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు.

అక్కడితో ఆగకుండా.. సురేందర్ రెడ్డి, శేఖర్ కమ్ముల వంటి దర్శకులకూ పవన్ కమిట్ మెంట్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నా.. శేఖర్ కమ్ములతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ ను పవన్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు గుసగుసమంటున్నాయి. ఇదే సమయంలో.. పొలిటికల్ గానూ.. పవన్ కల్యాణ్ యాక్టివ్ అవుతున్నారు. అధికార పార్టీతో యుద్ధానికి సిద్ధమంటూ ఇటీవల సెన్సేషనల్ కామెంట్ చేశారు.

పవన్ రాజకీయ ప్రసంగాలు, సమావేశాలకు మంచి స్పందన సైతం ప్రజల నుంచి వచ్చినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల.. జనసేన సోషల్ మీడియా వింగ్, యూత్ లీడర్లతో భేటీలోనూ పవన్ ఇదే విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ పొలిటికల్ వేవ్ ను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలంటే.. ప్రజల్లో మరింత సమయం గడపాలన్న అభిప్రాయానికి పవన్ అండ్ టీం వచ్చారని సమాచారం.

అందుకే.. చేతిలో ఉన్న సినిమాలతో పాటు.. అన్ అఫీషియల్ గా కమిట్ అయిన ఇతర సినిమాలను కూడా పవన్ త్వరగా ఫినిష్ చేయాలని తొందర పడుతున్నారట. భీమ్లా నాయక్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకముందే.. హరిహర వీరమల్లుపైనా ఆయన కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అతి త్వరలో భవదీయుడు భగత్ సింగ్ పనినీ మొదలు పెట్టనున్నారు. ఓవరాల్ గా.. సినిమాలను త్వరగా పూర్తి చేసి పాలిటిక్స్ లో పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Read More:

Pawan Kalyan: టీడీపీ ఆఫీసులపై దాడులను తీవ్రంగా ఖండించిన జనసేనాని..!

Related Articles

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

Latest Articles

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....

India Post GDS Result 2021 declared for Maharashtra, Bihar: Here’s how to check

India Post GDS Result 2021: India Post has announced results for Gramin Dak Sevak recruitment exam 2021 for Maharashtra and Bihar. All the registered...