Friday, January 28, 2022

భారత్ – పాక్ : గంటలోనే అమ్ముడుపోయిన టికెట్లు…


క్రికెట్‌ ఫ్యాన్స్‌ కి డబుల్‌ దమాకా మ్యాచ్‌. బెట్టింగ్‌ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్‌. నువ్వా నేనా అనే ఫైట్‌ ఈసారి వరల్డ్‌ కప్‌లో మొదటి మ్యాచే కావడంతో… సూపర్‌ సండే ఫైట్‌ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లో దంచికొట్టిన టీం కోహ్లీ… దయాది తో జరిగే మ్యాచ్‌ కోసం సయ్యంటోంది. క్రికెట్‌ లవర్స్‌ ఈ మ్యాచ్‌ కోసం ఎదరుచూస్తుంటే… మరోవైపు దాయాది పాకిస్తాన్‌ను వ్యతిరేకించే వర్గాలు మాత్రం.. ఈ మ్యాచ్‌ని బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో… దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వద్ద అక్కడి ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.

దాయాదుల పోరులో గెలుపెవరిది అనేదానికన్నా… మ్యాచ్‌ సమయం దగ్గరపడే కొద్దీ.. దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల్లో టీంఇండియా పాకిస్తాన్‌ తో మ్యాచ్‌ని బహిష్కరించాలని వాదనలు మొదలయ్యాయి. ఓ వైపు కశ్మీర్‌లో అరాచకాలు సృష్టిస్తున్న పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు… అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను వ్యతిరేకిస్తున్న పాక్‌ తో మ్యాచ్‌ ఆడొద్దని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తోపాటు కేంద్రమంత్రులు రామ్‌నాథ్‌ అథవాలే, గిరిరాజ్‌ సింఘ్‌, బీహార్‌ డిప్యుటీ సీఎం తార్‌కిషోర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మరొకవైనపు దేశంలో పాకిస్తాన్‌ ని వ్యతిరేకించే హిందూ సంఘాలు కూడా వీరికి గొంతును కలిపాయి.

సూపర్‌ సండే ఫైట్‌ పై రాజకీయ వ్యతిరేకత ఎంతున్నా…. మ్యాచ్‌ జరిగి తీరుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీకి ఇచ్చిన మాట ప్రకారం అంతర్జాతీయ టోర్నీలో అర్ధంతరంగా తప్పుకోవడం కుదరదన్నారు బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా. ఆటకు…. రాజకీయ వివాదాలకు… క్రికెట్‌ మ్యాచ్‌లను బహిష్కరించడం సబబు కాదని బీసీసీఐ వాదన. ఇండియా పాక్‌తోపాటు ప్రపంచ దేశాల్లో దాయాదుల మధ్య మ్యాచ్‌ జరగాలనే వారి సంఖ్య అధికంగా ఉందంటున్నారు క్రికెట్‌లవర్స్‌.

అయితే… ఇండియా పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా.. తాను సోషల్‌ మీడియాకు బలవుతున్నానని వాపోతోంది టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. పాకిస్తాన్‌ కోడలిగా ఇండియా ఐకాన్‌గా తాను ఈసారి ఎవరికీ మద్దతివ్వకుండా… ఈ హై టెన్షన్‌ మ్యాచ్‌ రోజున సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటానని వీడియో పోస్ట్‌ చేసింది.
స్పాట్… సానియా వీడియో

వరల్డ్‌ కప్‌ లో ఏ మ్యాచ్‌ కి లేనటువంటి టికెట్ల డిమాండ్‌… ఇండో పాక్‌ మ్యాచ్‌ కి ఉండటంతో… దుబాయ్‌లో గంటకే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం కెపాసిటి… 25 వేలు. 24న జరిగే మ్యాచ్‌ కోసం ఈనెల 4న టికెట్లను అందుబాటులోకి తెచ్చింది ఐసీసీ. సైట్‌లో పెట్టిన గంటలోపే టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి.

ఇండియా పాక్‌ మ్యాచ్‌ దుబాయ్‌లోనే జరుగుతున్నా…. హైదరాబాద్‌లో జరుగుతోందా అని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి పబ్స్‌, మాల్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ని అట్రాక్ట్‌ చేసేలా ఫుడ్‌ అండ్‌ డ్రింక్స్‌ పై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బిగ్‌ స్క్రీన్స్‌, ప్రొజెక్టర్లను ఏర్పాటు చేస్తున్నాయి. సినిమా హాల్స్‌ కూడా పెద్దగా రద్దీగా లేకపోవడంతో… మ్యాచ్‌ ను థియేటర్‌లో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

Latest Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....