Friday, January 28, 2022

Karthika deepam : డాక్టర్ బాబు ముందే డ్యాన్సులు.. వెడ్డింగే డే వెరైటీ ప్లానింగ్ | The Telugu News

Karthika deepam : కార్తీకదీపం డాక్టర్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. స్టార్ మాలో కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలో, అటు జీ తెలుగులో హిట్లర్ గారి పెళ్లాం అంటూ హిట్లర్ కారెక్టర్‌లో నిరుపమ్ దుమ్ములేపుతున్నాడు. అలా రెండు సీరియల్స్‌తో నిరుపమ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే నిరుపమ్ తన సీరియల్స్, డబ్బింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటాడు.

Nirupam paritala shares wedding day celebrations video

నిరుపమ్ సోషల్ మీడియాలో వేసే పంచ్‌లు, సెటైర్లకు అంతా ఫిదా అవుతుంటారు. స్వతాహాగా రైటర్ అవ్వడంతో ప్రాసల మీద మంచి గ్రిప్పు ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే నిరుపమ్ యూట్యూబ్‌లోనూ దూసుకుపోతోన్నాడు. గత నెలలో తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ చానెల్‌లో వస్తోన్న వీడియోలు, డాక్టర్ బాబు పర్సనల్ విషయాలు చూపిస్తుండటంతో వెంటనే వైరల్ అవుతున్నాయి.

Karthika deepam : డాక్టర్ బాబు వెడ్డింగ్ డే సెలెబ్రేషన్స్

Nirupam paritala shares wedding day celebrations video
Nirupam paritala shares wedding day celebrations video

మొన్నామధ్య డాక్టర్ బాబు వెడ్డింగ్ డే అని మంజుల కొన్ని సెలెబ్రేషన్స్ చేసింది. కార్తీకదీపం సెట్‌కు వచ్చి మరీ మంజుల.. తన భర్తతో కలిసి తమ వెడ్డింగ్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. అయితే ఆరోజు సాయంత్రం స్పెషల్ ప్రోగ్రాం కూడా చేసినట్టు కనిపిస్తోంది. ఓ రెస్టారెంట్‌కు కుటుంబం, పొరుగింటివాళ్లందరినీ రెస్టారెంట్‌కు తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక రెస్టారెంట్‌లో డాక్టర్ బాబు ఎంట్రీ ఇవ్వడంతోనే అక్కడి వారంతా లుంగీ డ్యాన్సు అంటూ స్టెప్పులు వేసేశారు.

Related Articles

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు...

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

Latest Articles

బిహార్ బంద్: రహదారుల దిగ్బంధం.. నిప్పటించిన ఆందోళనకారులు

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్షల నిర్వహణలో అస్తవ్యస్త విధానాలకు నిరసనగా శుక్రవారం విద్యార్థి సంఘాలు ఇచ్చిన బిహార్ బంద్‌కు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల మహాకూటమి మద్దతు ప్రకటించింది. ఉదయం నుంచి...