Friday, January 28, 2022

Today horoscope : అక్టోబ‌ర్ 17 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు | The Telugu News


Advertisement

మేష రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సమావేశం మీకు సంతోషం కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు ఇబ్బంది పడవచ్చు. విద్యార్థులు బాగా శ్రమించిల్సిన సమయం. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. క్రీడలు ఆడుతారు. ధనలాభం సంభవిస్తుంది. అతిథుల రాకతో బిజీగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ కుల దైవాన్ని ప్రార్ధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు మీ ఇంట్లోవారు లేదా స్నేహితుల ప్రవర్తన వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రయాణాలు లేదా మీరు చేసే విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది. విద్యార్థులకు మంచి సమయం దీన్ని ఉపయోగించికుంటే మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా అద్భుతమైన రోజు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు తగ్గిచ్చుకోండి. ధనం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. షేర్‌మార్కెట్‌ అంతగా కలసిరాదు ఈరోజు. విద్యార్థులకు బాగా కష్టపడాల్సిన రోజు. వైవాహికంగా సంతోషం ఉంటుంది. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

Today horoscope : అక్టోబ‌ర్ 17 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు | The Telugu News
today horoscope in telugu


సింహ రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీ శక్తికి మించిన పనులు చేయకండి. పొదుపు చేయడం చాలా ముఖ్యమని ఈరోజు మీరు గుర్తిస్తారు. అనవసర ఖర్చుల చేస్తే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఏదురుకుంటారు. పెండింగ్ లో గల సమస్యలు పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అనుకోని అతిథులు మీ ఇంటికి వస్తారు. వైవాహికంగా సాఫీ జీవితం గడుపుతారు. శ్రీ దుర్గాదేవికి ఎర్రని పుష్పాలతో అర్చన చేయండి. కన్యా రాశి ఫలాలు : ఈరోజు సంతోషం, ఉల్లాసం మీ సొంతం. పనులు చేసేటప్పుడు ఆందోళన లేకుండా ముందుకు పోండి. ధనాన్ని భద్రమైన చోట పొదుపు చేయండి. ఈరోజు మీరు చేసే పనులు మీకుటుంబానికి అమితమైన సుఖసంతోషాలను కలిగిస్తుంది. వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మీ వైవాహిక జీవితంలో చాలా సాధారణంగా ఉంటుంది. విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.


తులా రాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన రోజు, పనులను వేగంగా పూర్తి చేస్తారు. ఈరోజు ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. పాత స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. ఈరోజు వైవాహికంగా సంతోషం మీ సొంతం. శివాభిషేకం చేయండి దీనివల్ల ఆర్థిక బాగుపడుతుంది. వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్‌ కోసం పొదుపు చేయాల్సిన రోజు. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలు తెస్తాయి. కుటుంబ సభ్యులు కుటుంబం పై మీ శ్రద్ధను కోరుకుంటారు. ఈరోజు ప్రేమికులు మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి- ఈరోజు జీవిత భాగస్వామికి మధ్య విబేధాలు రావచ్చు. ఆఫీస్‌లో ఓపికతో పనిచేయాల్సిన రోజు. విద్యార్థులు శ్రమించాలి. శ్రీ శివాభిషేకం చేయండి.

today horoscope in telugu
today horoscope in telugu

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆశతో ధనాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయండి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అనుకోని అతిథులు మీ ఇంటికి వస్తారు. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఖాళీ సమయాన్ని వినియోగించుకోండి భవిష్యత్‌ కోసం. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య సంతోషం, ఉత్సాహం కనిసపిస్తుంది. దుర్గాదేవిని ఆరాధించండి. మకర రాశి ఫలాలు : ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. దీనితో ఉల్లాసంగా మీరు పనిచేస్తారు. ఈరోజు అప్పులు ఎవరికి ఇవ్వకండి. ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అతిథులు మీ ఇంటికి వస్తారు. దీనివల్ల మీ సమయం వృథా అవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. వైవాహికంగా మీకు వత్తిడి కలిగించే రోజు. ఇష్టదేవతారాధన చేయండి.


కుంభ రాశి ఫలాలు : ఈరోజు విశ్రాంతి లభిస్తుంది. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయండి. ధనం చేతిలో ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు మమూలుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. ప్రత్యర్థులకు మీరు అందనంత దూరంగా మీరు ఎత్తులు వేస్తారు. శ్రీ శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది. మీన రాశి ఫలాలు : ఈరోజు ఆహార విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. వ్యాపారం సాధారణంగా ఉంఉంది. కుటుంబ సభ్యులు మీ నుంచి ఎక్కువ కోరుకుంటారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వైవాహికంగా సంతోషం, ఉల్లాసం లభిస్తాయి. విద్యార్థులు శుభవార్త వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

Related Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Latest Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...

UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది....